భారత్ నౌకపై దాడి.. ఖండించిన కేంద్రం

ఒమన్‌ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై తాజాగా క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడి ఆమోదయోగ్యం కాదని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఆ నౌకలోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారనివి దేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు.

భారత్ నౌకపై దాడి.. ఖండించిన కేంద్రం

పశ్చిమాసియా యుద్ద సెగలు భారత్ ను తాకుతున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలపై ఆంక్షలతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ చమురు కొరత సమస్యతో అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సఫ్లయ్ చైన్ తెగిపోయి..చమురు, యూరియాన, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరిగిపోతూ భారత్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇది చాలదన్నట్లుగా భారత్ వస్తున్న నౌకలలో తరచూ దాడులు చోటుచేసుకుంటుండటం ఆందోళన కరంగా మారింది.

ఒమన్‌ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై తాజాగా క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడి ఆమోదయోగ్యం కాదని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఆ నౌకలోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారనివి దేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన సిబ్బందికి ముప్పు కలిగించడం వంటివి తగదని భారత్ స్పష్టం చేసింది. నౌకలోని సిబ్బందిని రక్షించడంలో సహకరించిన ఒమన్‌ అధికారులకు భారత్‌ కృతజ్ఞతలు తెలిపింది. అయితే భారత్ నౌక వివరాలు.. దానిపై ఎవరు దాడి చేశారనేది వివరాలు తెలియరాలేదు. ఓ వైపు ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల బ్రిక్స్ దేశాల సమావేశానికి వచ్చిన సమయంలో భారత్ నౌకపై దాడి జరుగడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి :

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్
మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల!