Gold Rate | పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.500 తగ్గి తులానికి రూ.67,550కి దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.550 పతనమై రూ.73,690కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే తగ్గుముఖం పట్టింది.
Gold Rate | పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.500 తగ్గి తులానికి రూ.67,550కి దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.550 పతనమై రూ.73,690కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే తగ్గుముఖం పట్టింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,670కి పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,690కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,840 ధర పలుకుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,690కి దిగివచ్చింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర పడిపోయింది. కిలోకు రూ.1000 తగ్గడంతో ఢిల్లీలో రూ.85,550 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ.89వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.