Gold Rates Hike | బంగారం ధర పైపైకి.. రూ.76వేలు దాటిన పసిడి..!

Gold Rates Hike | పసిడి ధరలు (Gold Rates) కొనుగోలుదారులకు వరుస షాక్‌ ఇస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూలేనివిధంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల (Inter National Market)లో బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ క్రమంలో దేశీయంగా ధరలపై ప్రభావం పడుతున్నది.

Reported by: Mallanna | వాణిజ్యం | Sep 24, 2024, 10:56 am IST
Read Time: 3 mins
Gold Rates Hike | బంగారం ధర పైపైకి.. రూ.76వేలు దాటిన పసిడి..!

Gold Rates Hike | పసిడి ధరలు (Gold Rates) కొనుగోలుదారులకు వరుస షాక్‌ ఇస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూలేనివిధంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల (Inter National Market)లో బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ క్రమంలో దేశీయంగా ధరలపై ప్రభావం పడుతున్నది. తాజాగా 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.70వేలకు ఎగిసింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.210 పెరగడంతో తులానికి రూ.76,360 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.70వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,360 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.70,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,510 పలుకుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.70వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,360కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.70వేలకు చేరగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,360కి పెరిగింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర నిలకడగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ధర రూ.93వేలు ఉండగా.. హైదరాబాద్‌లో కిలోకు రూ.98వేల వద్ద నిలకడగా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.