Gold Rates Hike | ఇలా పెరిగితే కొనేదెట్లా..! మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold Rates Hike | కొనుగోలుదారులను బంగారం, వెండి ధరలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గినట్టే తగ్గిన మళ్లీ ఆకాశాన్ని ఆకాశాన్నంటుతున్నాయి. . వరుసగా రెండురోజుల పాటు స్వల్పంగా దిగివచ్చిన ధరలు గురువారం బులియన్‌ మార్కెట్‌లో మరోసారి పెరిగాయి.

Reported by: Mallanna | వాణిజ్యం | May 16, 2024, 6:14 pm IST
Read Time: 3 mins
Gold Rates Hike | ఇలా పెరిగితే కొనేదెట్లా..! మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold Rates Hike | కొనుగోలుదారులను బంగారం, వెండి ధరలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గినట్టే తగ్గిన మళ్లీ ఆకాశాన్ని ఆకాశాన్నంటుతున్నాయి. . వరుసగా రెండురోజుల పాటు స్వల్పంగా దిగివచ్చిన ధరలు గురువారం బులియన్‌ మార్కెట్‌లో మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.700 పెరిగి తులానికి రూ.67,850కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి తులానికి రూ.74,020కి చేరింది. వెండిపై ఏకంగా రూ.1500 పెరిగి కిలో రూ.89వేలు దాటింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,130కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,020కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.68వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,170కి పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,020 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. రూ.1500 వరకు పెరిగి.. ఢిల్లీలో కిలో రూ.89,100కి ఎగిసింది. హైదరాబాద్‌లో రూ.92,200కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.