మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,200 తగి 1,53,550కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,100 గ్గి రూ. 1,40,750వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 గ్గి 2,70,000వద్ద కొనసాగుతుంది.

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల.. అంతర్జాతీయ ఆర్థిక, బౌగోళిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,200 తగి 1,53,550కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,100 గ్గి రూ. 1,40,750వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 గ్గి 2,70,000వద్ద కొనసాగుతుంది.

ఇరాన్‌తో కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించడంతో విలువైన లోహాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గడిచిన ఏడాది కాలంలో సుమారు 42 శాతానికి పైగా అద్భుతమైన వృద్ధిని కనబరిచిన బంగారం, ప్రస్తుతం పశ్చిమాసియా ప్రతికూల పరిణామాలతో స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బంగారం కంటే బాండ్లపై పెట్టుబడులు సురక్షితంగా భావించడం, అమెరికన్ డాలర్ బలోపేతం కావడం బంగారంపై ఒత్తిడి పెంచుతున్న ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, మార్కెట్ లో కొనుగోళ్ల ఊపు పెరిగి ధర $4,820 డాలర్ల కంటే పైకి ఎగబాకితే, అది తిరిగి $5,000 డాలర్ల మార్కును చేరుకునే దిశగా సాగవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత ధరల తగ్గుదలని కొనుగోలుకు ఒక అవకాశంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణ పరిస్థితులు, ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు బంగారం పరుగును నిర్ణయిస్తాయని, ప్రస్తుత స్వల్పకాలిక అస్థిరతకు భయపడకుండా, సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆశించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2026లో బంగారం ధర $5,000 స్థాయిని చేరే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేయమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Ramana Gogula | గుండుతో కనిపించే రహస్యం ఇదే… సంగీత దర్శకుడు రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ వైరల్!
పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు..వీడియో వైరల్