gold, silver price today| స్థిరంగా బంగారం, వెండి ధరలు

ఆదివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,970 వద్ద నిలకడగా కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 22, 2026, 11:57 am IST
Read Time: 2 mins
gold, silver price today| స్థిరంగా బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా నిలిచాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,970 వద్ద నిలకడగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,33,800 వద్ద నిలిచింది. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులు బంగారం, వెండి ధరలలో అస్థిరతను కొనసాగిస్తున్నాయి. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు అన్నీ కలిసి పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతుండగా.. మరోవైపు గత రెండేళ్లుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఊహించని పతనాన్ని చవిచూస్తున్నాయి. 2025లో బంగారం 66%, వెండి 135% మేర అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. ఇంతటి భారీ పెరుగుదల తర్వాత ధరలు కొంత మేర తగ్గడం సహజమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.