విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద పరిణామాలతో బంగారం, వెండి ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 1,52,840 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,40,100 వద్ద కొనసాగుతుంది. వెండి ధర సైతం రూ .2,65,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
ఇరాన్ – అమెరికా మధ్య చర్చల ప్రతిష్టంభన బంగారం, వెండి ధరలపై పడే అవకాశం కనిపిస్తుంది. దీంతో ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలికంగా బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2026 రెండవ త్రైమాసికంలో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకుతాయని కొన్ని సంస్థలు బలంగా విశ్వసిస్తుండగా, మరికొన్ని సంస్థలు మార్కెట్‌లోని అస్థిరత గురించి హెచ్చరిస్తున్నాయి.
స్వల్పకాలికంగా మార్కెట్‌లో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, భవిష్యత్ అమెరికా ద్రవ్య విధానాలు, డాలర్ విలువలో మార్పులు, పెరుగుతున్న అమెరికా ఫెడరల్ అప్పులు వంటి అంశాలు బంగారానికి సానుకూలంగా మారతాయని అంచనా. వీటికి తోడు మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేట్లు కూడా ఈ మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారాయి. ప్రస్తుత సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి బంగారం ధర ఔన్సుకు 5,800 డాలర్ల స్థాయిని చేరుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
