తగ్గిన బంగారం.. స్ధిరంగా వెండి ధరలు

సోమవారం బంగారం ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,55,290కి దిగొచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 1,42,350కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియ యుద్ద పరిస్థితుల పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. బంగారం ధరల్లో మార్పు పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత మార్చి నెలలో భారీగా తగ్గిన ధరలు ఈ నెలలో పెరుగుతూ వస్తున్నాయి. అయితే సోమవారం రోజు కాస్త ఊరటనిస్తూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,55,290కి దిగొచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 1,42,350కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,80,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

హెచ్చుతగ్గులకు అవకాశం

ప్రపంచ స్వర్ణ మండలి (WGC) విశ్లేషణల మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వైపు సాగితే సంప్రదాయ ఆస్తులపై ఇన్వెస్టర్లకు నమ్మకం పోతే, బంగారం ధరలు ప్రస్తుత స్థాయి నుండి మరో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేయనున్నాయి. డాయిష్ బ్యాంక్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 5,000 డాలర్ల మార్కును తాకుతుందని అంచనా వేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం బంగారం ధర ప్రతి ట్రాయ్ ఔన్సుకు 5,000 డాలర్ల స్థాయిని చేరవచ్చు. మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణలో ఔన్సుకు 4,500 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ప్రతి ట్రాయ్ ఔన్సుకు 5,000 డాలర్ల మార్కును దాటే అవకాశముందని తెలిపింది.

అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు నిలకడగా కొనసాగినట్లయితే ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో బంగారం ధరలు 20 శాతం వరకు తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, నిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

అత్యవసరంగా ఢిల్లీకి హరీశ్ రావు..కాళేశ్వరం తీర్పు టెన్షన్!
Mega Heroes | మెగా ఫ్యామిలీ హీరోల‌కి వరుస సర్జరీలు… ఆందోళన చెందుతున్న అభిమానులు

Latest News