అత్యవసరంగా ఢిల్లీకి హరీశ్ రావు..కాళేశ్వరం తీర్పు టెన్షన్!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు సోమవారం హుటాహటిన ఢిల్లీ వెళ్లారు. హరీశ్ రావు అత్యవసరంగా ఢిల్లీ వెళ్లడానికి కాళేశ్వరం కమిషన్ పై ఎల్లుండి తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుండటమే కారణమని బీఆర్ఎస్ వర్గాల సమాచారం. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటే..ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని హరీశ్ రావు నిర్ణయించినట్లుగా సమాచారం.
విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు సోమవారం హుటాహటిన ఢిల్లీ వెళ్లారు. మాజీ ఎంపీ వినోద్ రావుతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లడం గమనార్హం. జగిత్యాలలో ఈ రోజు కేసీఆర్ బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉన్న హరీశ్ రావు అనూహ్యంగా ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది.
హరీశ్ రావు అత్యవసరంగా ఢిల్లీ వెళ్లడానికి కాళేశ్వరం కమిషన్ పై ఎల్లుండి తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుండటమే కారణమని బీఆర్ఎస్ వర్గాల సమాచారం. కాళేశ్వరం కమిషన్ చట్టబద్దతను, నివేదిక చెల్లుబాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, సహా పలువురు ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పుటికే ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు ఎల్లుండి తీర్పు వెలువరించనుంది. అయితే హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటే..ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని హరీశ్ రావు నిర్ణయించినట్లుగా సమాచారం. అందుకే ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించేందుకు ఢీల్లీ వెళ్లనట్లుగా బీఆర్ఎస్ వర్గాల కథనం.
కాళేశ్వరం కమిషన్ తరహా కమిషన్లను సవాల్ చేస్తూ గతంలో పలు రాష్ట్రాలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారికి సానుకూలంగా తీర్పు వెలువడ్డాయని బీఆర్ఎస్ విశ్లేషిస్తుంది. అందుకే హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే దానిపై వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్, హరీశ్ రావులు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి :
Deepika |గర్భిణిగా ఉన్నా వెనుకడుగు వేయని దీపికా.. యాక్షన్ సన్నివేశాల్లో మెరుపులు మెరిపిస్తుందా?
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు : కడియం శ్రీహరి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram