Gold-Silver Rates | పసిడి, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold-Silver Rates | కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనాసగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.73,750 వద్ద కొనసాగుతున్నది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 14, 2024, 1:14 pm IST
Read Time: 3 mins
Gold-Silver Rates | పసిడి, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold-Silver Rates | కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనాసగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.73,750 వద్ద కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,240 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.68,050 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,240 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,900 వద్ద నిలకడగా ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,750 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి ధర స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో కిలో ధర రూ.95,500 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో రూ.లక్ష పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.