• Telugu News
  • /Business

Gold-Silver Rates | మోతమోగిస్తున్న వెండి ధర..! స్వల్పంగా బంగారం పైపైకి..!

Gold-Silver Rates | వెండి ధర మరోసారి భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో ధర పెరుగుతున్నది. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో పుత్తడి కిలో ధర తొలిసారిగా రూ..1,02,000 మార్క్‌ని దాటింది. అదే సమయంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

Reported by: Mallanna | వాణిజ్యం | May 29, 2024, 10:34 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | మోతమోగిస్తున్న వెండి ధర..! స్వల్పంగా బంగారం పైపైకి..!

Gold-Silver Rates | వెండి ధర మరోసారి భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో ధర పెరుగుతున్నది. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో పుత్తడి కిలో ధర తొలిసారిగా రూ..1,02,000 మార్క్‌ని దాటింది. అదే సమయంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బుధవారం 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి తులానికి రూ.67,100కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగి తులానికి రూ.73,200కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,910కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,200కి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,350కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,200 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. రూ.1200 పెరిగి ఢిల్లీలో రూ.97,700కి చేరింది. ఇక హైదరాబాద్‌లో కిలో రూ.1,02,000 ధర పలుకుతున్నది. హైదరాబాద్‌లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.