Cibil Score | మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? స్కోర్‌ని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

Cibil Score | క్రెడిట్‌ కార్డ్‌ కావాలన్నా.. లోన్‌ తీసుకోవాలన్నా సిబిల్‌ స్కోర్‌ కీలకమైంది. సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా వడ్డీకి లోన్‌ పొందే వీలుంటుంది. దాంతో ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ, సిబిల్‌ సరిగా లేకపోతే లోన్‌ అయినా, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జారీ చేయవచు. అయితే, ఇప్పటి వరకు ఒక్క లోన్‌ తీసుకోకపోయినా సిలిబ్‌ ప్రభావితమవుతుందా? అని చాలామందిలో డౌట్‌ ఉంటుంది.

Cibil Score | మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? స్కోర్‌ని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

Cibil Score | క్రెడిట్‌ కార్డ్‌ కావాలన్నా.. లోన్‌ తీసుకోవాలన్నా సిబిల్‌ స్కోర్‌ కీలకమైంది. సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా వడ్డీకి లోన్‌ పొందే వీలుంటుంది. దాంతో ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ, సిబిల్‌ సరిగా లేకపోతే లోన్‌ అయినా, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జారీ చేయవచు. అయితే, ఇప్పటి వరకు ఒక్క లోన్‌ తీసుకోకపోయినా సిబిల్ ప్రభావితమవుతుందా? అని చాలామందిలో డౌట్‌ ఉంటుంది. ఖచ్చితంగా సిబిల్‌ స్కోర్‌పై ఎఫెక్ట్‌ ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొటున్నారు. సిబిల్‌ అనేది త్రీ డిజిట్‌ నంబర్‌. క్రెడిట్‌ హిస్టరీని ఇది సూచిస్తుంది. సాధారణంగా 300 – 900 మధ్యలో ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా లోన్​ని తీసుకునే వీలుంటుంది.

దీన్ని బట్టే బ్యాంక్​లు, ఆర్థిక సంస్థలు ఇంకా లోన్లు ఇచ్చేందుకు ముందుకువస్తాయి. కానీ.. ఇప్పటి వరకు లోన్‌ తీసుకోకపోయినట్లతే.. మీకు క్రెడిట్‌ హిస్టరీ అనేదే ఉండదు. క్రెడిట్​ హిస్టరీయే లేకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లు ఇచ్చే విషయంలో ఆలోచనలో పడుతాయి. లోన్‌ ఇవ్వాలా వద్దా? అని ఆలోచిస్తుంటాయి. ఒక వేళ ఇచ్చినా వడ్డీ ఎక్కువగా ఉంటుంది. జీరో సిబిల్​ స్కోర్​ అనేది ఎప్పటికీ మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీరో సిబిల్‌ స్కోర్‌ ఉన్నా లోన్‌ రాదని కాదని.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆర్థిక సంస్థలు లోన్‌లు మంజూరు చేస్తాయని చెబుతున్నారు. అయితే, వడ్డీపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. క్రెడిట్​ స్కోర్​ని లోన్​ ఇచ్చే సంస్థలు మాటిమాటికి సిబిల్‌ చెక్‌ చేసినా స్కోర్‌ దెబ్బతినే అవకాశాలుంటాయి.

ఇది రుణగ్రహీతలకు ఏమాత్రం మంచిది కాదు. అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సిబిల్​​ స్కోర్​ అనేది లోన్​పైనే ఆధారపడి ఉంటుందనుకోవడం సరికాదు. క్రిడెట్‌ కార్డులపై సైతం ఆధారపడి ఉంటుంది. కాలంలో బిల్లులు చెల్లించకపోయినా స్కోర్‌ మీరు వాడే క్రెడిట్​ కార్డుపైనా కూడా ఆధారపడి ఉంటుంది. మీరు సకాలంలో క్రెడిట్​ కార్డు బిల్లులు చెల్లించకపోతే.. అప్పుడూ సిబిల్​ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోకపోయినా పెద్ద ప్రమాదంలో పడినట్లే. స్కామ్​స్టర్​లు మీ పేరుతో లోన్​లు తీసుకుని, డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి.

అందుకే క్రమం తప్పకుండా సిబిల్‌ చెక్‌ చేసుకోవడం మంచిది. సిబల్‌ను పెంచుకునేందుకు పెద్ద పెద్ద లోన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్స్‌, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్స్‌ తదితర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసి.. రెగ్యులర్‌గా చెల్లిస్తే సరిపోతుంది. అప్పు భారం ఉండదు.. క్రెడిట్‌ స్కోర్‌ సైతం హెల్తీగా ఉంటుంది. సాధారణంగా 750 కన్నా ఎక్కువ సిబిల్​ స్కోర్​ ఉంటే చాలా మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతంటారు. 550 – 750 మధ్యలో ఉంటే గుడ్‌ సిబిల్‌ స్కోర్‌గా పరిగణిస్తారు. 550 కన్నా దిగువగా ఉంటే మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టే లెక్క.