ITR Filing 2024 | ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు ముగిసినా.. రిటర్న్‌లను ఫైల్‌ చేయొచ్చా..?

ITR Filing 2024 | ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అంతా తప్పనిసరిగా ఇన్‌కం ట్యాక్స్‌ కనీస పరిమితి దాటితే తప్పనిసరిగా రిటర్న్‌లను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైలింగ్‌కు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. మరో 14 రోజుల్లో ముగియనున్నది. అప్పటిలోగా ఉద్యోగులు, వ్యాపారులు ఐటీ రిటర్న్‌లను ఫైల్‌ చేయాల్సిందే.

ITR Filing 2024 | ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు ముగిసినా.. రిటర్న్‌లను ఫైల్‌ చేయొచ్చా..?

ITR Filing 2024 | ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అంతా తప్పనిసరిగా ఇన్‌కం ట్యాక్స్‌ కనీస పరిమితి దాటితే తప్పనిసరిగా రిటర్న్‌లను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైలింగ్‌కు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. మరో 14 రోజుల్లో ముగియనున్నది. అప్పటిలోగా ఉద్యోగులు, వ్యాపారులు ఐటీ రిటర్న్‌లను ఫైల్‌ చేయాల్సిందే. అయితే, చాలామంది మదిలో గడువు తీరిన తర్వాత అంటే జూలై 31 తర్వాత రిటర్న్‌లను ఫైల్‌ చేయొచ్చా? అనే సందేహం నెలకొన్నది. అయితే, ఐటీఆర్‌ ఫైలింగ్‌ను గడువులోగా ఫైలింగ్‌ చేయాల్సిందే. నిర్ణీత గడువులోగా రిటర్న్‌లను ఫైల్‌ చేస్తేనే పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలుంటాయి. ఇన్‌కం ట్యాక్స్‌ నుంచి రీఫండ్‌ రావాల్సి ఉంటే త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

హోంలోన్‌, కార్‌లోన్‌ కావాల్సిన సమయంలో వేగవంతంగా ప్రాసెసింగ్‌ జరిగే సూచనలుంటాయి. అందు కోసమే చాలామంది గడువులోగా ఐటీఆర్‌లను ఫైల్‌ చేస్తుంటారు. అనుకోని సందర్భాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. అలా ఆలస్యం జరిగితే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? అంటే ఫైల్‌ చేసేందుకు బిలేటెడ్‌ రిటర్న్‌ ఫైలింగ్‌కు అవకాశం ఉంది. వాస్తవానికి ఆదాయపు పన్నులు గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కారణంతో ఆలస్యమైతే డిసెంబర్ 31 వరకు మరోసారి గడువు ఉంటుంది. అదే బిలేటెడ్ రిటైర్న్‌ ఫైలింగ్‌. ఎప్పుడైనా ఏదైనా అనుకోని కారణాలతో ఆలస్యమైనప్పుడు మరో అవకాశమిచ్చేందుకు ఇన్‌కంటాక్స్ శాఖ ఈ వెసులుబాటు కల్పించింది. జూలై 31 లోగా ఐటీఆర్‌ను ఫైలింగ్‌ చేయలేకపోతే డిసెంబర్ 31 వరకూ మరో అవకాశం ఉంటుంది. అయితే, జరిమానా చెల్లించాల్సి రానున్నది. ఈ జరిమానా ఆదాయంను బట్టి మారుతూ వస్తుంది.

వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపుంటే రూ.1000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అదే వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటితే రూ.5వేలు చెల్లించాలి. ఈ జరిమానాతో పాటు ట్యాక్స్ మొత్తంపై వడ్డీ చెల్లించాల్సిందే. వడ్డీ అనేది ఆగస్టు 1 నుంచి మీరు రిటర్న్‌లను ఫైల్‌ చేసే వరకు లెక్కిస్తుంటారు. ఇది పన్ను చెల్లించేవారికి ఆర్థికభారంగా మారుతుంది. దాంతో పాటు గత ఏడాది స్టాక్ మార్కెట్, వ్యాపారంలో జరిగిన నష్టాన్ని వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేసేందుకు అవకాశం ఉండదు. బిలేటెడ్ రిటర్న్‌లతో ఇంటి ఆస్తికి సంబంధించిన నష్టాన్ని మాత్రమే పూడ్చుకునేందుకు వీలుంటుంది. ఈ క్రమంలోనే వీలైనంత వరకు సకలంలోనే ఐటీఆర్‌ను ఫైలింగ్‌ చేస్తే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.