Motorola Edge 50 | అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేయనున్నది. అయితే, ఈ మోడల్‌పై చాలారోజుల నుంచి బజ్ నెలకొన్నది. ఎప్పుడు లాంచ్ అవుతుందన్నది తెలియరాలేదు. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
Motorola Edge 50 | అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేయనున్నది. అయితే, ఈ మోడల్‌పై చాలారోజుల నుంచి బజ్ నెలకొన్నది. ఎప్పుడు లాంచ్ అవుతుందన్నది తెలియరాలేదు. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఎక్స్‌టీ 2401-1 మోడల్ నంబర్‌తో వస్తున్న మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా గ్యాడ్జెట్‌కి ఇటీవల బీఐఎస్ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ సర్టిఫికేషన్ లభించిందంటే త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లుగా అర్థం ఆసియా, యూరప్, లాటిన్ అమెరికాలో లాంచ్ అయిన కొద్ది సమయానికిలో భారత్‌లో బీఐఎస్ సర్టిఫికేషన్ పూర్తయ్యిందని టాక్.
ఎడ్జ్ 50 అల్ట్రా త్వరలో భారత్‌లో లాంచ్ అవనుండగా.. ఎడ్జ్ 50ప్రో స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఎడ్జ్ 50 అల్ట్రా ఇండియన్ వెర్షన్‌పై మోటోరోలా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మోడల్ యూరోపియన్ వెర్షన్లో ఉన్న ఫీచర్స్ దాదాపు భారత్‌లో లాంచ్ అయ్యే మోడల్స్‌లో కనిపించనున్నాయి. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 6.7 ఇంచ్ సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 2800 నిట్స్ వరకు గరిష్ఠంగా బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, హెచ్డీఆర్ 10ప్లస్ సర్టిఫికేషన్ కలిగి ఉన్నది.
ముందు భాగంలో 3డీ కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఎడ్జ్ 50 అల్ట్రా ఫ్రేమ్ శాండ్బ్లాస్టెడ్ అల్యూమినియంతో రూపొందించింది. ఈ ఫోన్‌కి ఐసీ 68 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో రానున్నది. అడ్రినో 735 జీపీయూతో కనెక్ట్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ సెటప్ ఉంటుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో రానున్నది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు అనువుగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఛార్జర్ లేదంటే 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఈ అల్ట్రా మోడల్ ఎప్పుడు లాంచ్ అవనున్నది ? స్పెసిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు సైతం వెల్లడి కావాల్సి ఉన్నది.