New UPI Rules From Nov 3 | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) యూపీఐ పేమెంట్స్ లో కొత్త నిబంధనలు సిద్దం చేసింది. నవంబర్ 3 నుండి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) యూపీఐలో కీలక మార్పులు చేసింది. . డిస్ప్యూట్, ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ సెటిల్‌మెంట్ సైకిల్స్‌ను వేరు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 3 నుండి ఇది అమల్లోకి రానుందని తెలిపింది.
యూపీఐ, ప్రస్తుతం ఆర్టీజీఎస్ ద్వారా రోజుకు 10 సెటిల్‌మెంట్ సైకిల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. వీటిలో ప్రతి దానిలో ఆథరైజ్డ్, డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ ట్రాన్సాక్షన్లు రెండూ ఉన్నాయి. లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో డైలీ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను సకాలంలో పూర్తిచేసేందుకు వీలుగా ఆథరైజ్డ్, డిస్ప్యూట్ సెటిల్‌మెంట్స్‌ను వేరు చేయాలని నిర్ణయించారు. దీని వలన బ్యాంకులు, పేమెంట్ పార్ట్‌నర్స్ ప్రతిరోజూ సెటిల్‌మెంట్స్ ను సమయానికి పూర్తిచేయగలరు. తద్వారా పేమెంట్ సిస్టమ్ కార్యాచరణ సామర్థ్యం మెరుగవుతుందని భావించింది.
రోజువారీ చెల్లింపుల పరిమితిని 10 లక్షలకు పెంపు
యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను రోజుకు రూ.10 లక్షల వరకు పెంచింది. పెట్టుబడులు, ఇన్సూరెన్స్, ట్రావెల్, క్రెడిట్ కార్డులు, ఆభరణాల కోసం పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్స్ రోజుకు రూ.10 లక్షల వరకు చేసే వీలు కల్పించింది. క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్ లావాదేవీల పరిమితి గతంలో రూ.2 లక్షలు ఉండగా, దానిని రూ.5 లక్షలకు పెంచారు. రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు లిమిట్ విధించారు. గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ ట్రాన్సాక్షన్స్, ట్రావెల్ బుకింగ్, లోన్ రీపేమెంట్స్, ఈఎమ్ఐ విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.
అలాగే యూపీఐ లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు పర్సన్ టు పర్సన్(పీటూపీ) ” కలెక్ట్ రిక్వెస్ట్ ” ఫీచర్‌ను తొలగించింది. పర్సన్ టు మర్చంట్(పీటూఎం) నుండి అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు అనుమతించే నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.