Bank Of Baroda | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఊరట.. బాబ్‌ వరల్డ్‌ యాప్‌పై నిషేధం ఎత్తివేసిన ఆర్‌బీఐ..!

Bank Of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఊరటనిచ్చింది. బ్యాంకుకు చెందిన ‘బీఓబీ వరల్డ్‌’పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో బ్యాంకు యాప్‌పై ఆర్‌బీసై నిషేధం విధించింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తర్వాత కొత్త కస్టమర్‌లు వరల్డ్‌యాప్‌లో చేరే అవకాశం కలిగింది.

Bank Of Baroda | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఊరట.. బాబ్‌ వరల్డ్‌ యాప్‌పై నిషేధం ఎత్తివేసిన ఆర్‌బీఐ..!

Bank Of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఊరటనిచ్చింది. బ్యాంకుకు చెందిన ‘బీఓబీ వరల్డ్‌’పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో బ్యాంకు యాప్‌పై ఆర్‌బీసై నిషేధం విధించింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తర్వాత కొత్త కస్టమర్‌లు వరల్డ్‌యాప్‌లో చేరే అవకాశం కలిగింది. మెటీరియల్ సూపర్‌వైజరీ ఆందోళనలను ఉటంకిస్తూ.. గతేడాది అక్టోబర్ బీఓబీ వరల్డ్‌లో కొత్త కస్టమర్స్‌ చేర్చుకోకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాను రిజర్వ్ బ్యాంక్ నిషేధించింది.

అప్పట్లో యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్యను పెంచి కస్టమర్లను మోసానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. అది తన దృష్టికి రావడంతో ఆర్‌బీఐ నిషేధం విధించింది. తన మొబైల్ యాప్ ‘బీఓబీ వరల్డ్‌’లో కొత్త కస్టమర్లను జోడించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2022 మార్చిలో యాప్ వినియోగదారుల సంఖ్యను పెంచాలని బ్యాంక్ ఉన్నతాధికారులు ఒత్తిడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో యాప్‌డౌన్‌లోడ్‌ల సంఖ్యను పెంచేందుకు బ్యాంకు ఉద్యోగులు సొంత, ఏజెంట్ల మొబైల్‌ నంబర్స్‌ను కస్టమర్‌ ఖాతాలో నమోదు చేసి.. యాప్‌ను యాక్టివేట్‌ చేయించారు.

యాప్ ద్వారా కస్టమర్ల ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఉదంతంతో ఒత్తిడి కారణంగా రిటైర్డ్ ఉద్యోగి టాప్ మేనేజ్‌మెంట్‌కు ఈ-మెయిల్ చేయడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని.. మోసంలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపగా నిజమేనని తేలింది.