Silver gold rates| వెండి, బంగారం ధరలు మరింత పైకి
వెండి, బంగారం ధరలు పోటీ పడి పెరిగిపోయాయి. వెండి ధరలు రికార్డు స్థాయి పెరుగుదలతో మరింత పైకి వెళ్లాయి.
విధాత, హైదరాబాద్ : వెండి(Silver), బంగారం(gold) ధరలు పోటీ పడి పెరిగిపోయాయి. వెండి ధరలు రికార్డు స్థాయి పెరుగుదలతో మరింత పైకి వెళ్లాయి. శుక్రవారం వెండి కిలో రూ.6000పెరిగి.రూ.2,15,000లకు చేరింది. వెండి ధర ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా రూ.19,100పెరగడం విశేషం. దీంతో వెండి ధరలు మార్కెట్ నిపుణుల అంచనాల మేరకు త్వరలోనే రూ.2,50,00మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
రూ.19,10పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,910పెరిగి రూ.1,32,660కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,750పెరిగి రూ.1,21,600కు చేరింది. మూడు రోజుల్లో బంగారం ధర రూ.3,220 పెరుగడం గమనార్హం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram