Railway Budget | దశాబ్దాల సంప్రదాయానికి మంగళం..! రైల్వే బడ్జెట్‌ను ఎందుకు విలీనం చేశారో తెలుసా..?

Railway Budget | వాస్తవానికి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు రైల్వే బడ్జెట్‌, సాధారణ బడ్జెట్‌లను వేర్వేరుగా సమర్పించేవారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లను కలిపి సమర్పించి.. దశబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి మంగళం పాడారు.

Railway Budget | దశాబ్దాల సంప్రదాయానికి మంగళం..! రైల్వే బడ్జెట్‌ను ఎందుకు విలీనం చేశారో తెలుసా..?

Railway Budget | వాస్తవానికి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు రైల్వే బడ్జెట్‌, సాధారణ బడ్జెట్‌లను వేర్వేరుగా సమర్పించేవారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లను కలిపి సమర్పించి.. దశబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి మంగళం పాడారు. ఇంతకుముందు పార్లమెంటులో రెండు బడ్జెట్లు ఉండేవి. అందులో ఒకటి ‘రైల్వే బడ్జెట్’, మరొకటి ‘జనరల్ బడ్జెట్’. భారత ప్రభుత్వం 21 సెప్టెంబర్ 2016న సాధారణ బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడానికి ఆమోదించింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అతను 1 ఫిబ్రవరి 2017న పార్లమెంట్‌లో స్వతంత్ర భారత తొలి సంయుక్త బడ్జెట్‌ను సమర్పించారు. ఈ సంవత్సరం సైతం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇందులో రైలు బడ్జెట్ సైతం ఉంటుంది. 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు, కేంద్ర బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించగా.. చివరిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేతరగా పీయూష్ గోయల్ నిలిచారు.

1924లో మొదలైన సంప్రదాయం..

రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్‌ అనే సంప్రదాయం 1924లో ప్రారంభమైంది. ఈ నిర్ణయం అక్వర్త్ కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, 2017 నుండి సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభించారు. 1921లో ఈస్ట్ ఇండియా రైల్వే కమిటీ చైర్మన్‌ సర్ విలియం అక్వర్త్ రైల్వేలను మెరుగైన నిర్వహణ వ్యవస్థలోకి తీసుకువచ్చారు. ఆయన 1924లో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి మొదలైన సంప్రదాయం 2016 వరకు కొనసాగింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, మొదటి రైల్వే బడ్జెట్‌ను 1947లో మొదటి రైల్వే మంత్రి జాన్ మథాయ్ సమర్పించారు. మథాయ్ భారత ఆర్థిక మంత్రిగా రెండు సాధారణ బడ్జెట్‌లను కూడా సమర్పించారు. 2016లో రైల్వే మంత్రిగా పని చేసిన పీయూష్ గోయల్ చివరిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రైల్వే బడ్జెట్‌ను ఎందుకు రద్దు చేశారు..

నవంబర్ 2016లో, రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేస్తుందని ప్రకటించింది. నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు.. దేబ్రాయ్, కిశోర్‌ దేశాయ్ ‘డిస్పెన్సింగ్ విత్ ది రైల్వే బడ్జెట్’ అనే ప్రత్యేక పేపర్‌పై ఈ నిర్ణయం తీసుకున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా రైల్వేల ద్వారా వచ్చే ఆదాయం సాధారణ ఆదాయ రాబడి కంటే 6 శాతం ఎక్కువ. ప్రత్యేక రైల్వే బడ్జెట్ సంప్రదాయాన్ని కొనసాగించాలని సర్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను 21 డిసెంబర్ 1949న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ ఆమోదం ప్రకారం 1950-51 నుంచి వచ్చే ఐదేళ్ల కాలానికి మాత్రమే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సమర్పించారు. అయితే, ఈ సంప్రదాయం 2016 వరకు కొనసాగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైల్వే ఆదాయం క్రమంగా తగ్గడం మొదలైంది. 1970లో రైల్వే బడ్జెట్ మొత్తం రెవెన్యూ రాబడిలో 30శాతంగా మిగిలింది. 2015-16లో, రైల్వే ఆదాయం మొత్తం ఆదాయంలో 11.5 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను రద్దు చేయాలని నిపుణులు సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసింది.