Athadu Re Release Records| ఇదెక్కడి ఫాలోయింగ్ రా నాయనా! అతడు రీ రిలీజ్‌కు ఊహించని క్రేజ్!

Athadu Re Release Records| తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమాల్లో ‘అతడు’ (athadu) ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సున్నితమైన ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ శైలిలో టచ్ చేసిన డైలాగ్స్, మనసుకు హత్తుకునే సంగీతం all in all ఈ సినిమా ఓ తరానికి ఓ మంచి జ్ఞాపకంగా నిలిచిపోయింది. టెలివిజన్ లో ఇప్పటివరకు 1500 సార్లు ప్రసారమైనా, ఎప్పటికీ బోర్ కొట్టని చిత్రం ఇది. ఇప్పుడీ క్లాసిక్ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) జన్మదినం సందర్భంగా, ఆగస్టు 9న ‘అతడు’ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశవిదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35mm, దేవీ 70mm వంటి మెయిన్ థియేటర్లలో టికెట్లు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. మరి ఆ థియేటర్‌నే 2005లో రిలీజ్ అయినప్పుడు ‘అతడు’ 200 రోజులు డైరెక్ట్‌గా ఆడిన సుదర్శన 35mm అనే విషయం గుర్తు ఉంది కదా? ఇప్పుడు అదే థియేటర్‌లో 4K వెర్షన్‌లో మళ్లీ ప్రదర్శించనున్నారు. నైజాం ఏరియాలో రీ-రిలీజ్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తుంది. సమాచారం ప్రకారం, రీ-రిలీజ్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.3 కోట్లు దాటి అమ్ముడయ్యాయని టాక్.
ఇంతవరకు మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’, ‘మురారి’, ‘పోకిరి’, ‘ఖలేజా’ వంటి సినిమాలు కూడా రీ-రిలీజ్‌ల్లో మంచి కలెక్షన్లను రాబట్టాయి. అయితే ‘అతడు’కి ఇప్పుడు కనిపిస్తున్న క్రేజ్ చూస్తుంటే, ఇది మరింత రికార్డులు నెలకొల్పేలా ఉందని సినీ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రీ-రిలీజ్ స్పెషల్‌గా, మహేష్ అభిమానుల కోసం ఓ కొత్త టైటిల్ కార్డ్ డిజైన్ చేసినట్టు కూడా సమాచారం ఉంది. సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వారం బాక్సాఫీస్‌ను కొత్తగా రిలీజయ్యే సినిమాల కన్నా మహేష్ బాబు సూపర్‌హిట్ రీ-రిలీజ్‌నే డామినేట్ చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.