‘గోదావరి’కి 15 ఏళ్ళు
విధాత:ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆనంద్ వచ్చిన రెండేళ్ల తర్వాత గోదావరి సినిమాతో మరోసారి తనలోని దర్శకత్వ ప్రతిభను చూపించాడు కమ్ముల. సుమంత్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2006 మే 19న విడుదలైంది. ఈ వేసవి చాలా […]

విధాత:ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆనంద్ వచ్చిన రెండేళ్ల తర్వాత గోదావరి సినిమాతో మరోసారి తనలోని దర్శకత్వ ప్రతిభను చూపించాడు కమ్ముల. సుమంత్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2006 మే 19న విడుదలైంది. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది.. అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ చిత్రం నిజంగానే వేసవిని చల్లగా మార్చేసింది.
పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ లాంటి క్లాసిక్ నిర్మించిన జి.వి.జి రాజు గోదావరి సినిమాను నిర్మించారు. అప్పటికే పోకిరి విడుదలై తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న తరుణంలో వచ్చిన గోదావరి.. చిన్నగా మొదలై మంచి విజయం సాధించింది. థియేటర్స్ లోనే కాదు బుల్లితెరపై కూడా ఇప్పటికీ గోదావరి వస్తే మిస్ కాకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అప్పట్లో సత్యం, గౌరీ లాంటి సినిమాలతో సుమంత్ మంచి మార్కెట్ సొంతం చేసుకోవడంతో ‘గోదావరి’ సినిమాను 4.2 కోట్లకు అమ్మారు. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి 5.21 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు కోటికి పైగా లాభాలు తీసుకొచ్చింది. సుమంత్ కెరీర్ లో మంచి విజయంగా నిలిచింది గోదావరి.
నేటితో సినిమా విడుదలై 15 ఏళ్లు .