అదిరిన అందాల ఐశ్వర్యం
నటీ ఐశ్వర్య మీనన్ లంగా ఓణీలో కట్టుబొట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా చూపరులను కట్టిపడేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది

విధాత : నటీ ఐశ్వర్య మీనన్ లంగా ఓణీలో కట్టుబొట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా చూపరులను కట్టిపడేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. తమిళ సినిమా కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో సినిమాల్లో ఐశ్వర్య మీనన్ అరంగేట్రం చేసి తెలుగులో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. కేరళలోని చెందమంగళం నుండి వచ్చిన ఐశ్యర్య మీనన్ కుటుంబం తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టి పెరిగింది.

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీదుంది. గ్లామర్‌తో పాటు ఫెర్‌ఫార్మెన్స్ పాత్రల్లోనూ ఒదిగిపోయే మీనన్‌కు అవకాశాలు ఆశించిన స్థాయిలోనే దక్కుతున్నాయి. వెబ్ సీరిస్‌ల్లోనూ అలరిస్తున్న ఈ భామా స్పై చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ చిత్రం పెద్దగా విజయవంతం కాకపోవడంతో మళ్లీ అవకాశాల కోసం గ్లామర్ స్టిల్స్‌తో కనువిందు చేస్తున్నది.
