Bollywood| బాలీవుడ్ ప్రముఖ నటులలో అనుపమ్ ఖేర్ ఒకరు. ఆయన ఎన్నో చిత్రాలలో నటించడమే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తూ ఉంటారు. 40 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో అనుపమ్ ఖేర్ 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ,
Bollywood| బాలీవుడ్ ప్రముఖ నటులలో అనుపమ్ ఖేర్ ఒకరు. ఆయన ఎన్నో చిత్రాలలో నటించడమే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తూ ఉంటారు. 40 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో అనుపమ్ ఖేర్ 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఇంగ్లిష్, చైనీస్ ఇలా పలు భాషలలో నటించారు అనుపమ్. టాలీవుడ్‌కి 1987లో వచ్చిన త్రిమూర్తులు చిత్రంతో పరిచయం కాగా, ఆ తర్వాత మళ్లీ తెలుగులో కార్తికేయ2 చేశారు. ఇక చివరిగా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించి అలరించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ్ తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటారు.
తాజాగా ఆయన ముంబై ఆఫీస్ లో దొంగలు పడి విచిత్రంగా దానిని ఎత్తుకెళ్లారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన ఆఫీస్‌లో దొంగలు పడి, ఇలా డోర్ విరగ్గొట్టారంటూ అనుపమ్ ఖేర్ వీడియో వదిలారు. అయితే విచిత్రంగా దొంగలు సినిమా నెగెటివ్‌ని ఎత్తుకెళ్లారని చెప్పుకొచ్చాడు. వాళ్లు చేసిన దొంగతనంకి సంబంధించిన విజువల్స్ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు త్వరలోనే దొంగలని పట్టుకుంటామని చెప్పారట. ఆటో నెంబర్ కూడా ఉండడంతో పట్టుకోవడం సులువు అవుతుందని వారు అన్నారట. అయితే ఆ దొంగలకి దేవుడు బుద్ధిని ప్రసాదించాలని అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో తెలిపాడు
ఇలా డోర్ విరగ్గొట్టారంటూ చెప్పిన అనుపమ్.. దొంగలు డబ్బులు జోలికి పోలీదు. ఖరీదైన ఫర్నీచర్ కూడా ఎత్తుకెళ్లలేదు. కేవలం ఆఫీస్‌లోంచి ఆ దొంగలు ఓ సినిమా నెగెటివ్‌ని ఎత్తుకెళ్లడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దొంగలు ఎత్తుకెళ్లింది ఖేర్ కంపెనీ నిర్మించిన చిత్రం సినిమా నెగిటివ్ కాగా, అది ఏ సినిమా అనేది మాత్రం ఆయన చెప్పలేదు. మరి రానున్న రోజులలో అయిన అనుపమ్ ఖేర్ పూర్తి వివరాలు తెలియజేస్తారా లేదా అనేది చూడాలి.