Devara Movie | ఎన్టీఆర్ ‘దేవర’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పోస్టు..
Devara Movie | 'దేవర' సినిమా (Devara Movie) విడుదల సాక్షిగా టాలీవుడ్లో అగ్ర హీరోల మధ్య స్నేహంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని మరోసారి ప్రేక్షకులు అందరికీ తెలిసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా విడుదల సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేశారు.

Devara Movie | ట్రిపుల్ ఆర్( RRR ) మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సోలోగా నటించిన మూవీ ‘దేవర’ ( Devara ). ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంజ్ నిన్న నోవాటెల్ హోటల్లో జరగాల్సి ఉండే. కానీ చివరి క్షణంలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసి ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర నిరాశను కల్పించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ దేవర( NTR Devara )పై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎక్స్ వేదికగా కీలక పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ( TDP ) – జనసేన( Janasena ) – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు అదనపు ఆటలతో పాటు టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ విధంగానే ఎన్టీఆర్ దేవర చిత్రానికి కూడా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
దీంతో జూ. ఎన్టీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ స్పందించారు. దేవర సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్‌కు బెస్ట్ విషెష్ అని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఏపీలో కొలువుదీరిన తమ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనది చేస్తుంది. అదే విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అండగా నిలబడుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.