మ‌ళ్లీ వార్త‌ల‌లోకి న‌య‌న‌తార విడాకులు.. ఆస్తుల‌న్నీ త‌న పేరుపైకి మార్చుకోవ‌డానికి కారణం?

మ‌ళ్లీ వార్త‌ల‌లోకి న‌య‌న‌తార విడాకులు.. ఆస్తుల‌న్నీ త‌న పేరుపైకి మార్చుకోవ‌డానికి కారణం?

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌తార గురించి టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హీరోలని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ల‌వ్ మేట‌ర్స్‌తో ఎక్కువ‌గా హైలైట్ అయింది. ప్ర‌భుదేవా, శింబుల‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయ‌ణం న‌డిపిన న‌య‌న‌తార ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో కొన్నాళ్లపాటు డేటింగ్‌లో ఉంది. ఆ త‌ర్వాత అత‌డిని వివాహం చేసుకొని స‌రోగ‌సి ద్వారా క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లి త‌ర్వాత నుండి న‌య‌న‌తార ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. ఆమెకి సంబంధించి అనేక ప్ర‌చారాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా న‌య‌న‌తార విడాకుల గురించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్‌ని అన్‌ఫాలో చేసిందని వారిద్ద‌రు విడిపోవ‌డం ఖాయం అంటూ ప్ర‌చారం చేశారు. క‌ట్ చేస్తే ఆ త‌ర్వాత వారిద్ద‌రు క‌లిసి క‌నిపించ‌డంతో అదంతా రూమ‌ర్ అని అనుకున్నారు. ఇక తాజాగా న‌య‌న‌తార చేసిన ప‌నితో మ‌ళ్లీ వారిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారంటూ టాక్ న‌డుస్తుంది. పెళ్లి భర్త మీద ఉన్న ప్రేమతో ఆయన పేరు మీదకు తన ఆస్తులు అన్నీ మార్పించింది న‌య‌న‌తార‌. కాని మ‌ళ్లీ ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని ఇప్పుడు ఆ ఆస్తుల‌న్నింటిని తిరిగి త‌న పేరున రాపించుకుంద‌ట‌. స‌రైన కార‌ణం తెలియ‌దు కాని ఆమె అలా చేయ‌డానికి కార‌ణం న‌య‌న‌తార త్వ‌రలో విడాకులు తీసుకోవ‌డ‌మే అని అంటున్నారు.

ఇప్పటికే న‌య‌న‌తార విడాకుల‌కి సంబంధించిన వస్తున్న పుకార్లకు ఎండ్ కార్డ్ ఇవ్వక‌ముందే మ‌ళ్లీ ఇప్పుడు నయనతార ఆస్తులు ట్రాన్స్ ఫర్ అనే వార్త రావడంతో అస‌లు ఆ జంట మ‌ధ్య ఏం జ‌రుగుతుంది, న‌య‌న‌తార అత‌నితో కూడా క‌లిసి ఉండ‌దా అంటూ ప‌లువురు ప‌లు ర‌కాల అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది అని కొంద‌రు అంటున్నారు. ఇక న‌య‌న‌తార ఈ మ‌ధ్య షారూఖ్ ఖాన్ న‌టించిన జవాన్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది . ఇన్నాళ్లు సౌత్‌కి ప‌రిమితం అయిన ఈమె క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్‌కి కూడా పాక‌డం విశేషం.