Mahesh Babu| హీరో మహేశ్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు
విధాత : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్‌పై. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయాయని వినియోగదారుల కమిషన్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాలాపూర్‌లో ఒక ప్లాట్ కోసం ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.34,80,000 చెల్లించామన్న బాధితులు తెలిపారు. లేఅవుట్ లేకపోవడంతో డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే..రూ.15 లక్షలే ఇచ్చారని ఫిర్యాదులో వెల్లడించారు. మిగతా డబ్బులు కూడా ఇప్పించి.. తమకు న్యాయం చేయాలని బాధితులు వినియోగదారుల కమిషన్ ను కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకులతో పాటు మహేశ్‌బాబుని విచారణకు రావాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్లు మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చారు.
సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో గతంలో ఈడీ కూడా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావలసిందిగా ఈడీ మొదట నోటీసులు ఇచ్చింది. షూటింగ్ కారణంగా హాజరు కాలేనని.. మరో తేదీన హాజరవుతానని మహేష్ బాబును ఈడీని అభ్యర్థించాడు. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ కు మహేశ్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇందుకు మహేశ్ బాబు రూ.5.9కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. 3.4కోట్లు నగదు రూపంలో, రూ.2.5కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram