Kalki 2898 AD Copy| కల్కి ట్రైలర్ కాపీ ఆరోపణలా.. ఆధారాలతో కడిగిపడేస్తున్నారుగా..!
Kalki 2898 AD Copy| ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా కల్కి చిత్రం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదల కానుంది. రిలీజ్‌కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల చేయగా, ఇంది హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులకి మంచి ట్రీట్ అందించింది. ఈ ట్రైలర్ చూసిన చాలా మంది నా

Kalki 2898 AD Copy| ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా కల్కి చిత్రం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదల కానుంది. రిలీజ్‌కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల చేయగా, ఇంది హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులకి మంచి ట్రీట్ అందించింది. ఈ ట్రైలర్ చూసిన చాలా మంది నాగ్ అశ్విన్, ప్రభాస్ అండ్ టీం ఈ చిత్రాన్ని ఎంతలా ప్రాణం పెట్టి చేశారో అర్ధమవుతుందని కామెంట్ చేశారు. అయితే రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో చిత్ర బృందానికి ఓ కొరియన్ షాక్ ఇచ్చారు. తన కష్టాన్ని కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియా వేదికగా కల్కి మేకర్స్ ని కడిగిపారేశారు.
కల్కి ట్రైలర్ మొదలవ్వగానే ఒక ఉపగ్రహం (శాటిలైట్) కింద పడినట్లు మనం చూడవచ్చు. ఇది దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్ డిజైన్ చేసిన శాటిలైట్ ఆర్ట్ అని, దానిని 10 ఏళ్ల క్రితమే సంగ్ చోయ్ డిజైన్ చేశారట. సంగ్ చోయి మర్వెల్ స్టూడియోస్, డిస్ని, వార్నర్ బ్రదర్స్ లాంటి సంస్థలలో పనిచేశారు. అయితే తన అనుమతి లేకుండా తను డిజైన్ చేసిన ఆర్ట్‌ని కల్కి టీమ్ కాపీ చేశారని.. ఇది న్యాయబద్దంగా కరెక్ట్ కాదని హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆరోపిస్తున్నారు. ఆయన షేర్ చేసిన ఆర్ట్ వర్క్, కల్కి ట్రైలర్ బిగినింగ్ లో కనిపించే ఆర్ట్ చాలా సిమిలర్ గా ఉన్నాయి.
ఇక ట్రైలర్ లో డూన్, మాడ్ మాక్స్, హాలో లాంటి హాలీవుడ్ చిత్రాల ఛాయలు కూడా కనిపిస్తున్నాయంటూ కొందరు కామెంట్ చేశారు. మొత్తంగా కల్కి ట్రైలర్ లో కూడా కాపీ అంశాలు ఉన్నట్లు పసిగట్టేసిన నెటిజన్స్ చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు వైజయంతి నిర్మాణ సంస్థ స్పందించింది లేదు. గతంలో రాజమౌళి సినిమాలపైనే ఇలాంటి కాపీ ఆరోపణలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు జక్కన్న అవన్నీ పట్టించుకోకుండా తన సినిమా నిర్మాణ పనులు పూర్తి చేసి మూవీని రిలీజ్ చేసి పెద్ద విజయం సాధించాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ అండ్ టీం కూడా ఈ చిత్రం విషయంలో అలానే ముందుకుపోనున్నట్టు తెలుస్తుంది.