విధాత: కరోనా బారిన పడి దాదాపు 10 రోజులుగా హోం ఐసొలేషన్ లో ఉన్న పూజా హెగ్డే పూర్తిగా కోలుకున్నారు. తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించింది. ప్రస్తుతం తాను చాలా ఆనందంగా ఉన్నానని, ఇన్నాళ్లూ తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది. ఏప్రిల్ 25న కరోనా బారిన పడింది పూజా హెగ్డే. ఓసారి ముంబయి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఓ షూటింగ్ లో పాల్గొంది. ఎక్కడ […]
విధాత: కరోనా బారిన పడి దాదాపు 10 రోజులుగా హోం ఐసొలేషన్ లో ఉన్న పూజా హెగ్డే పూర్తిగా కోలుకున్నారు. తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించింది. ప్రస్తుతం తాను చాలా ఆనందంగా ఉన్నానని, ఇన్నాళ్లూ తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది.
ఏప్రిల్ 25న కరోనా బారిన పడింది పూజా హెగ్డే. ఓసారి ముంబయి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఓ షూటింగ్ లో పాల్గొంది. ఎక్కడ ఆమెకు వైరస్ ఎటాక్ అయిందనేది అంతుచిక్కలేదు. పాజిటివ్అని తెలిసిన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. ఐసొలేషన్ లో ఉంటూ యోగా, ధ్యానం చేసింది. మంచి పుస్తకాలు చదివింది. అలా 10 రోజుల ఐసొలేషన్ తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది పూజాహెగ్డే.
అయితే పూజా హెగ్డే కోలుకున్నప్పటికీ ప్రస్తుతానికి వృత్తిగతంగా ఆమె చేసేదేం లేదు. దేశవ్యాప్తంగా
సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. మొన్నటివరకు తెగించి చేసిన పుష్ప లాంటి సినిమాలు కూడా ఆగిపోయాయి. సో.. కరోనా నుంచి బయటపడిన ఈ ముద్దుగుమ్మ ఇంకొన్నాళ్లు ఇంట్లో రెస్ట్ తీసుకోవడమే.