Pooja Hegde | టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజాహెగ్డేపై కన్నేసిన డైరెక్టర్‌..! ప్రొడ్యూసర్‌ కామెంట్స్‌ వైరల్‌..!

Pooja Hegde | టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డేపైనే ఓ స్టార్‌ డైరెక్టర్‌ కన్నేశారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ నిర్మాత బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Pooja Hegde | టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజాహెగ్డేపై కన్నేసిన డైరెక్టర్‌..! ప్రొడ్యూసర్‌ కామెంట్స్‌ వైరల్‌..!

Pooja Hegde | టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డేపైనే ఓ స్టార్‌ డైరెక్టర్‌ కన్నేశారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ నిర్మాత బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ 4 సీజన్‌ ఇటీవల ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందడి చేశారు. ప్రస్తుతం ఆహాలో ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అవుతున్నది. ఇక రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్‌ వదిలింది.

లక్కీ భాస్కర్‌ మూవీ టీమ్‌ రెండో ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నది. హీరో దుల్కార్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు షోకి హాజరైనట్లు కనిపించింది. ఇక ప్రోమోలో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చారు. గడ్డుకాలం ఎదురొచ్చినా.. చెడ్డవాడు ఎగేసుకొచ్చినా అనే డైలాగ్‌ను తనదైన శైలిలో చెప్పి అభిమానులను అలరించారు. ఆ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌పైకి స్టేజీకి చేరుకోగానే.. ఈ గ్లామర్‌ నన్ను నేను చూసుకుంటున్నట్లుగా దుల్కర్‌తో బాలయ్య చెప్పగా.. ఆయన సిగ్గుపడ్డారు. ఇక షోలో పాల్గొన్న నాగవంశీ పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఎవరైనా హీరోయిన్‌తో సినిమా చేయాలని ఉందా? అని ప్రశ్న డైరెక్టర్‌ వెంకీ అట్లూరికి ఎదురైంది. దీనికి నిర్మాత నాగవంశీ బదులిస్తూ వెంకీకి గతంలో నుంచి హీరోయిన్‌ పూజా హెగ్డేపై కన్ను ఉందనే విషయం బయటపెట్టారు.

ప్రస్తుతం నాగవంశీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన లక్కీ భాస్కర్‌ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న విడుదల కానున్నది. ఇప్పటికే మూవీ టీమ్‌ ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్‌ షోకు హాజరైంది. ఇక పూజా హెగ్డే ఆచార్య మూవీలో కనిపించింది. ఎఫ్‌ 3 మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం, బాలీవుడ్‌లో దేవా మూవీతో పాటు తమిళంలో సూర్య 44 మూవీ, దళపతి విజయ్‌ 69 మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నది.