Janhvi Kapoor | తెలుగులో అదరగొట్టిన జాన్వీ కపూర్.. జాన్వీ పాప అని పిలుస్తున్నందుకు థ్యాక్స్ అంటూ..!
Janhvi Kapoor | అలనాటి అందాలతార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)తో దేవర మూవీ (Devara Movie)తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. మూవీ విడుదలకు ముందు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.

Janhvi Kapoor | అలనాటి అందాలతార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)తో దేవర మూవీ (Devara Movie)తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. మూవీ విడుదలకు ముందు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో తెలుగులో అనర్గళంగా మాట్లాడింది. పుట్టినప్పటి నుంచి ముంబయిలో సెటిల్ అయిన జాన్వీకి తెలుగు వస్తుందా? రాదా? అని చాలామంది ఫ్యాన్స్ తెలియదు. అయితే, తెలుగులో తనకు ఎంత పట్టుందో దేవర ప్రమోషనల్ వీడియోలో జాన్వీ చెప్పే ప్రయత్నం చేసింది.
తెలుగు అమ్మాయిలా లంగా ఓణీలో..
జాన్వీ వీడియోలో లంగావోణిలో తెలుగు అమ్మాయిలా కనిపించింది. తాను నేరుగా అభిమానులను కలిసి మాట్లాడుదామనుకున్నానని.. అది కుదరలేదంటూ చెప్పింది. వీడియో పోస్ట్‌ని సైతం తెలుగులోనే పెట్టడం గమనార్హం. వీడియో ప్రకారం.. ‘అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా స్వాగతించి.. నాపై ప్రేమను చూపించిన తెలుగు అభిమానులకు.. నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ‘మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. నాకు కూడా ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతి రోజూ కష్టపడతాను. దేవర నా తొలి అడుగు. శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఈ మూవీకి ఎంచుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్’ అంటూ చెప్పుకొచ్చింది.
ఈసారి అలా కుదరలేదు..
అయితే, ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నానని.. కానీ ఈ సారికి అలా కుదరలేదని చెప్పింది. త్వరలోనే అందరినీ కలుస్తానని.. ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఈ చిన్న మెసేజ్. సెప్టెంబర్ 27న థియేటర్లలో కలుద్దాం అంటూ ఇన్‌స్టాలో తెలుగులో క్యాప్షన్ పెట్టింది. జాన్వీ కపూర్ దేవరతో తెలుగులోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానున్నది. ఈ క్రమంలో దేవర టీమ్ దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నది. ఇటీవల తమిళనాడులో జరిగిన ప్రమోషన్స్‌లోనూ జాన్వీ కపూర్ పాల్గొంది. అక్కడ సైతం తమిళంలోనే మాట్లాడింది. తెలుగు, తమిళం.. అక్కడి అభిమానులతో శ్రీదేవికి ఎంత అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవర మూవీని కొరటాల శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శ్రీకాంత్‌తో పాటు పలువురు కీలకపాత్రలు పోషించనున్నారు.
View this post on Instagram