Devara | ‘దేవర’ రికార్డ్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌..! ఇక ఎన్టీఆర్‌ ఆ సెంటిమెంట్‌ని దాటుతాడా..?

Devara | యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం దేవర. రెండుపార్టులుగా తెరకెక్కతున్న ఈ మూవీ తొలిపార్ట్‌ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల కానున్నది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో గ్లోబల్‌ స్థాయిలో ఎన్టీఆర్‌ గుర్తింపు పొందారు.

Devara | ‘దేవర’ రికార్డ్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌..! ఇక ఎన్టీఆర్‌ ఆ సెంటిమెంట్‌ని దాటుతాడా..?

Devara | యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం దేవర. రెండుపార్టులుగా తెరకెక్కతున్న ఈ మూవీ తొలిపార్ట్‌ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల కానున్నది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో గ్లోబల్‌ స్థాయిలో ఎన్టీఆర్‌ గుర్తింపు పొందారు. ఈ మూవీలో రాంచరణ్‌తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. ఈ మూవీకి ఆస్కార్‌ అవార్డు సైతం దక్కింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ సోలోగా నటిస్తున్న చిత్రం దేవర. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నది. జాన్వీ తెలుగులో తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. ఇక బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ క్రమంలో మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ విషయానికి వస్తే.. నైజాంలో రూ.44కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఉమ్మడి ఉత్తరాంధ్రలో రూ.12.40 కోట్లు, ఉమ్మడి తూర్పు గోదావరిలో రూ.7.75 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 6.50 కోట్లు, పాత గుంటూరులో రూ.8.50 కోట్లు, కృష్ణాలో రూ.7.20 కోట్లు, నెల్లూరులో రూ.4.20కోట్ల బిజినెస్‌ చేసింది. తెలంగాణ, ఏపీతో కలిపి రూ.112.55కోట్లు, కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.కోటి, హిందీ, రెస్ట్‌ ఆఫ్‌ భారత్‌తో కలిపి రూ.20కోట్లు, ఓవర్సీస్‌లో రూ.27 కోట్ల బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.182.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌గా రూ.184 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నది. ఎన్టీఆర్‌ సోలో హీరోగా చేస్తున్న ఈ మూవీ.. బిగ్గెస్ట్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన మూవీగా రికార్డులకెక్కింది.

సెంటిమెంట్‌ అధిగమిస్తాడా..?

వాస్తవానికి రాజమౌళితో మూవీ చేసిన తర్వాత ఏ హీరో అయినా మరో సినిమా చేసి హిట్‌కొట్టిన రికార్డు లేదు. మరి ‘దేవర’తో ఎన్టీఆర్‌ సెంటిమెంట్‌ను అధిగమిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూవీ టీజర్‌, సాంగ్స్‌ మూవీపై అంచనాలు పెంచాయి. ఎన్టీఆర్‌ ఈ మూవీలో డబుల్‌ రోల్‌ చేస్తాడని ఇప్పటి వరకు తెలిసిందే. అయితే, తాజాగా త్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్‌ నడుస్తున్నది. ఇక మూవీ విడుదలకు ముందు నార్త్‌ అమెరికా సహా పలు దేశాల్లో 2 మిలియన్స్‌ యూఎస్‌ డాలర్స్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ టికెట్స్ క్షణాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. తెలంగాణలో, ఏపీలో వారం రోజుల పాటు భారీగా టికెట్‌ రేట్లను పెంచుకోవడంతో పాటు అదనపు షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ‘దేవర’ టాక్‌ పాజిటివ్‌గా వస్తే బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.