Kalki 2898 AD| బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న క‌ల్కి.. ఆర్ఆర్ఆర్ రికార్డులు తిర‌గ‌రాస్తుందా..!

Kalki 2898 AD| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో అమితాబ్, దీపికా, క‌మ‌ల్ కీల‌క పాత్ర‌లుగా రూపొందిన మైథాల‌జీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం క‌ల్కి 2898 ఏడి. జూన్ 27న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. సినిమా రిలీజై వారం రోజులు దాటినా కూడా ఇప్పటికీ థియేటర్స్ క‌ళ‌క‌ళ‌లాడుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకి పైగా వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. 'బాహుబలి: ది కన్‌క్లూ

  • By: sn    cinema    Jul 07, 2024 6:47 AM IST
Kalki 2898 AD| బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న క‌ల్కి.. ఆర్ఆర్ఆర్ రికార్డులు తిర‌గ‌రాస్తుందా..!

Kalki 2898 AD| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో అమితాబ్, దీపికా, క‌మ‌ల్ కీల‌క పాత్ర‌లుగా రూపొందిన మైథాల‌జీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం క‌ల్కి 2898 ఏడి. జూన్ 27న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. సినిమా రిలీజై వారం రోజులు దాటినా కూడా ఇప్పటికీ థియేటర్స్ క‌ళ‌క‌ళ‌లాడుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకి పైగా వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత టాలీవుడ్ నుంచి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీగా ఉంది క‌ల్కి చిత్రం. ఇక ఈ మూవీ నార్త్ అమెరికాలో కూడా దుమ్ము రేపుతుంది. 15 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లని పూర్తి చేసుకుంది. అంటే 125కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి.

గ‌తంలో `బాహుబలి 2`, `జవాన్‌` చిత్రాలు మాత్ర‌మే ఆ రేంజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి.. `జవాన్‌ 17 మిలియన్స్, `బాహుబలి 2` 20 మిలియన్స్ డాలర్లు వసూలు చేయ‌గా, లాంగ్‌ రన్‌లో `కల్కి` ఈ రికార్డులను బ్రేక్ చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇక ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. 250కోట్లకుగాపై వసూళ్లని రాబట్టిందట. తెలంగాణలోనే వంద కోట్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, నార్త్ ఇండియా, తమిళం, కన్నడ, మలయాళం కలిసి రెండు వందల కోట్లు దాటింది. ఓవరాల్‌ ఓవర్సీస్‌లో ఇది 300కోట్లు క్రాస్‌ చేయబోతుందని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.

ప్ర‌స్తుతానికి క‌ల్కికి అడ్డుగా నిలిచే సినిమాలు ఇప్పుడు లేవు. భార‌తీయుడు 2 రిలీజ్ వ‌ర‌కు క‌ల్కి హవా కొన‌సాగుతుంది. భార‌తీయుడు2 బాగుంటే క‌ల్కిపై కాస్త ఎఫెక్ట్ ప‌డుతుంది. లేదంటే జాత‌ర కొన‌సాగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక క‌ల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్, మాళవిక నాయర్ , దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రల్లో మెరిశారు. ఇక ప్రభాస్ రోబో కారు బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ విష‌యం చెప్పిన సంగ‌తి తెలిసిందే. స్టార్ క్యాస్టింగ్‌తో అత్య‌ద్భుతంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు నాగ్ అశ్విన్. ఇక మూవీ రెండో పార్ట్ 2026లో రిలీజ్ కానుంది.