Kalyan Dev:మార్చలేనప్పుడు వదులుకోవడమే.. శ్రీజ భర్త కామెంట్స్ నెట్టింట వైరల్
Kalyan Dev: ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీ ఇంట జరుగుతున్న విడాకుల విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు పవన్ విడాకుల విషయాలు ఎక్కువ ప్రస్తావనకి రాగా, ఆ తర్వాత శ్రీజ విడాకులు, అనంతరం నిహారిక విడాకుల గురించి జోరుగా చర్చలు నడుస్తున్నాయి. శ్రీజ భర్త కొన్ని నెలల క్రితం తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలని డిలీట్ చేయడంతో పాటు ఆమెని అన్‌ఫాలో చేశాడు. దీంతో వారిద్దరు విడిపోయారనే ప్రచారం […]

Kalyan Dev: ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీ ఇంట జరుగుతున్న విడాకుల విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు పవన్ విడాకుల విషయాలు ఎక్కువ ప్రస్తావనకి రాగా, ఆ తర్వాత శ్రీజ విడాకులు, అనంతరం నిహారిక విడాకుల గురించి జోరుగా చర్చలు నడుస్తున్నాయి. శ్రీజ భర్త కొన్ని నెలల క్రితం తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలని డిలీట్ చేయడంతో పాటు ఆమెని అన్‌ఫాలో చేశాడు. దీంతో వారిద్దరు విడిపోయారనే ప్రచారం నడిచింది. అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఆసక్తికర పోస్ట్‌లు పెడుతుంటారు. అవి చూసిన నెటిజన్స్ వీరిద్దరు విడిపోవడం జరిగిందని అంచనాకి వచ్చేసారు. ఇటీవల కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వేడుకలలో కనిపించకపోవడం కూడా అనుమానాలు మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేశాయి.
కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా శ్రీజకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పకనే చెప్పేశారు. మెగా అల్లుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇందులో .. మన జీవితంలో మార్చలేనివి ఉంటే వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడు అవి మనకు అత్యంత మధురమైన క్షణాలు .. మీరు ఏకీభవిస్తారా అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట శ్రీజని ఉద్దేశించే కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేశాడని కొందరు ముచ్చటించుకుంటున్నారు. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఇంతవరకు మెగా ఫ్యామిలీ నుండి రాలేదు.
ఇక కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ దేవ్.. తన పోస్ట్‌లో కూతురితో వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసి చాలా మంది కళ్యాణ్ దేవ్.. శ్రీజ విడిపోయారని అనుకున్నారు. ఇక శ్రీజని పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ విజేత అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. ఇక మెగా ఫ్యామిలీ నుండి దూరంగా వెళ్లిపోయాక కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయడమే మానేశాడు.