Pawan Kalyan| అంద‌రి మ‌ధ్య‌లో ప‌వన్ క‌ళ్యాణ్‌కి ఐ ల‌వ్ యూ చెప్పిన యువ‌తి.. రియాక్ష‌న్ ఏంటి?

Pawan Kalyan| సినిమాల నుండి రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి స‌క్సెస్ అయిన వారు చాలా త‌క్కువ మంది. వారిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రు. . ఎన్నో అవమానాలు, ఓటము

  • By: sn    cinema    Aug 01, 2024 7:45 AM IST
Pawan Kalyan| అంద‌రి మ‌ధ్య‌లో ప‌వన్ క‌ళ్యాణ్‌కి ఐ ల‌వ్ యూ చెప్పిన యువ‌తి.. రియాక్ష‌న్ ఏంటి?

Pawan Kalyan| సినిమాల నుండి రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి స‌క్సెస్ అయిన వారు చాలా త‌క్కువ మంది. వారిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రు. . ఎన్నో అవమానాలు, ఓటములు చూసి కూడా మొండిగా నిలబడి తాను కోరుకున్న మార్పు దిశగా వెళుతున్నాడు.. సినిమాల పరంగా తెచ్చుకున్న పవర్ స్టార్ అనే ట్యాగ్ ని రాజకీయాల్లో కూడా కూడా నిజం చేసి రియల్ పవర్ స్టార్ అయ్యాడు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల సేవ‌లో బిజీగా ఉన్నాడు. అయితే వీలున్న‌ప్పుడల్లా సినిమాలు కూడా చేసే ప్లాన్ వేసుకుంటున్నాడు. పవన్ నుంచి ఖచ్చితంగా 6 సినిమాలు రావడం పక్కా అని చెప్పాలి. కాగా ఇపుడు పవన్ ఆల్రెడీ సెట్స్ మీద ఉంచిన సినిమాలు మూడు వరుసగా హరిహర వీరమల్లు, OG, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ఫినిష్ చేయాల్సి ఉంది.

పవన్ ఇప్ప‌టికే కమిట్మెంట్ ఇచ్చిన చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా ఖచ్చితంగా ఉందని మొన్ననే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇది నాలుగోది. ఇక ఐదు, ఆరు సినిమాలు ఏవంటే ఇప్పుడు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల్లో రెండిటికి అధికారికంగా సీక్వెల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. హరిహర వీరమల్లు కి పార్ట్ 2 ఉంది. అలానే ఓజీకి కూడా పార్ట్ 2 ఉంటుంద‌ని అర్ధ‌మవుతుంది.ఇవి చేసి ప‌వ‌న్ సినిమాలు ఆపేస్తాడ‌ని అంటున్నారు. ఇక ప‌వ‌న్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కి అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల‌లోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఓ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్ సీరియ‌స్‌గా మాట్లాడుతున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో, తన లైఫ్‌లో మనీ మ్యాటర్‌ గురించి ఆయన సీరియస్‌ గా స్పీచ్ ఇస్తూ ఉండ‌గా, ఓ అమ్మాయి డిస్ట్ర‌బ్ చేసింది. అమ్మాయి గట్టిగా `ఐ లవ్యూ` చెప్పింది. డబ్బులు కలెక్ట్ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్‌ చెబుతుండగానే వెనకాల నుంచి అమ్మాయి `ఐ లవ్యూ సర్‌` అని చెప్ప‌డంతో దెబ్బకి స్పీచ్‌ ఆపేసి పవన్‌ ఆమె వంక చూశాడు. ఆమెని చూసిన పవన్‌.. నవ్వుతూ `అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా అబ్బా` అన్నాడు పవన్‌. అంతే దెబ్బకి ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిళ్ళిపోయింది. నిజంగానే ఇది చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్‌గా మారింది.. పవన్‌ ఫ్యాన్స్ ఇష్టపడేలా, బ‌ట్టలు చించుకునే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్‌గా మారింది.