విధాత : ప్రేమలు అనే మలయాళ సినిమాతో ఓవర్ నైట్ యూత్ క్రష్ గా మారిపోయిన మమతా బైజూ వరుస సినిమాలతో జోష్ మీదుంది. తాజాగా ఆమె ప్రఖ్యాత మహిళా మ్యాగజైన్ వనిత కవర్ పేజీకి ఇచ్చిన స్టిల్స్ కుర్రకారును ఆకట్టుకున్నాయి. ఆకుపచ్చ డ్రెస్ లో గులాబీ పూలు బుట్టల మధ్య వయ్యారంగా హోయలు పోతు చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన స్టిల్స్ కు యూత్ ఫిదా అవుతున్నారు.
మాలీవుడ్ నుంచి కోలివుడ్ కు ఎదిగిన ఈ కేరళా కుట్టి తమిళంలో విజయ్ చిట్టచివరి సినిమా ‘జన నాయగన్’లో కీలక పాత్ర పోషిస్తుంది. తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంలో నటించిన మమతా తాజాగా విష్ణు విశాల్ ‘ఈరందు వానం’చిత్రంలోనూ రొమాన్స్ చేస్తుంది. డ్రాగన్ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో డ్యూడ్’ సినిమాలో నటిస్తుంది. తమిళ థ్రిల్లర్ ‘పోర్ తొళిల్’ చిత్ర దర్శకుడు విఘ్నేష్ రాజాతో ధనుష్ సినిమాలోనూ మమతా ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్యకు జంటగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మమతాబైజూ ప్రస్తుతం అర డజన్ సినిమాలలో నటిస్తూ కెరీర్ రేసులో దూసుకెలుతుంది.