#MEGA158 | మెగాస్టార్‌తో కలసి నటించబోతున్న సూపర్‌స్టార్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం #MEGA158లో మరో సూపర్‌స్టార్ నటిస్తున్నారని వార్త. ఆ పేరు తెలిసిన వెంటనే ఫ్యాన్స్ పండగ వాతావరణం. బాబీ కొల్లి దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మాణం.

Fans Go Wild as Mohanlal Joins Megastar Chiranjeevi in Bobby Kolli’s #MEGA158
టాలీవుడ్‌లో మెగాఫ్యాన్స్ ఊహించని అద్భుతం జరగబోతోంది! మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం #MEGA158లో మరో లెజెండరీ స్టార్ కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఆ పేరు బయటకు రాగానే అభిమానులు ఉత్సాహంతో మునిగిపోయారు.
అది మరెవరో కాదు — మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్! అవును… తెలుగు, మలయాళ సినీ ప్రపంచాలను దశాబ్దాలుగా ఏలుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు తొలిసారిగా ఒకే తెరపై కనువిందు చేయబోతున్నారు.
ఈ భారీ చిత్రం వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో, ప్రముఖ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతోంది. మెగా మాస్, భావోద్వేగం, స్నేహం మేళవించిన కథాంశంతో ఈ చిత్రం పాన్–ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం. ఇద్దరు నటుల మధ్య ఉన్న స్నేహం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రసిద్ధమే. చిరంజీవి పలు సందర్భాల్లో మోహన్‌లాల్‌ను ప్రశంసించగా, లాల్ కూడా చిరంజీవిని దక్షిణ భారత సినీ జగత్తుకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్నేహం తెరపై ప్రతిఫలించబోతోందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్‌మీడియా అంతా ప్రస్తుతం “మెగాస్టార్ – సూపర్‌స్టార్ కలయిక అంటే ఇదే!” అంటూ ఫ్యాన్ ఆర్ట్స్, పోస్టర్లతో నిండిపోయింది. “చిరు–లాల్ ఒకే తెరపై అంటే అది కేవలం సినిమా కాదు, అది వేడుక” అని అభిమానులు చెబుతున్నారు.
ఈ మల్టీ–స్టారర్‌లో ఇద్దరు హీరోయిన్‌లు ఉండనున్నారు.అనధికారిక సమాచారం ప్రకారం, ఒక హీరోయిన్‌గా మాళవిక మోహనన్, మరో హీరోయిన్‌గా రాశి ఖన్నా ఎంపికైనట్లు తెలిసింది. మాళవిక మోహనన్ ఇప్పటికే తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో తన ముద్ర వేసుకుంది. రాశి ఖన్నా కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన స్టార్. వీరి జోడీ సినిమా గ్లామర్, క్లాస్ రెండింటినీ పెంచబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, KVN ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలో ఇవ్వనుంది. ఈ కలయిక తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయం. ఇప్పటికే కేవీఎన్ ప్రొడక్షన్స్ తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో భారీ తారాగణంతో చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరో విశేషంగా, తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలతో కేవీఎన్ అన్ని భాషలలో నెంబర్ 1 నిర్మాణ సంస్థగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.
A massive surprise awaits fans! Megastar Chiranjeevi’s next film #MEGA158 will feature another Indian cinema legend — Superstar Mohanlal. Directed by Bobby Kolli and produced by KVN Productions, this marks the first-ever collaboration between the two icons. Fans are calling it “a celebration, not just a film.”