Pawan Kalyan| వ‌ద్దంటున్నా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాళ్లు మొక్కిన నారా లోకేష్‌..అందరు షాక్..!

Pawan Kalyan| ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసారు. ఆయ‌న‌తో పాటు 24 మంది మంత్రులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న చిరంజీవి పాదాల‌కి న‌మ‌స్క‌రించి ఆశీ

  • By: sn    cinema    Jun 13, 2024 2:09 PM IST
Pawan Kalyan| వ‌ద్దంటున్నా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాళ్లు మొక్కిన నారా లోకేష్‌..అందరు షాక్..!

Pawan Kalyan| ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసారు. ఆయ‌న‌తో పాటు 24 మంది మంత్రులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న చిరంజీవి పాదాల‌కి న‌మ‌స్క‌రించి ఆశీస్సులు అందుకోగా, మిగ‌తా మంత్రులు చంద్ర‌బాబు, న‌రేంద్ర మోదీ పాదాల‌కి న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే చంద్రబాబు కొత్త మంత్రుల‌ని త‌న పాదాల‌కి న‌మ‌స్క‌రించవ‌ద్దంటూ సైగ చేసి పంపారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కాని చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ గా మారింది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత నారా లోకేశ్.. పవన్ వద్దకెళ్లి ఆయన కాళ్లు మొక్కారు. జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కే ప్ర‌యత్నం లోకేష్ చేయ‌గా, ప‌వ‌న్ వద్దంటూ ఆపారు. ఏం పర్లేదు.. నాకు సోదరుడితో సమానమైన మీ కాళ్లు మొక్కడంలో తప్పులేదంటూ.. పవన్ కాళ్లు మొక్కి ఆశీర్వచనం తీసుకున్నారు నారా లోకేశ్. సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో ఎలాంటి త‌ప్పులేదంటూ తెలుగు త‌మ్ముళ్లు, జ‌న‌సైనికులు అంటున్నారు. ఏది ఏమైన నారా లోకేష్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాళ్లు మొక్కడంకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అయింది.

ఇది చూశాక లోకేష్ పై మరింత అభిమానం పెరిగిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయ‌న‌ని చూసి నేర్చుకోవాల‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి అహం లేకుండా నారా లోకేశ్ పవన్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకోవడం తమ గుండెలను తాకిందని జ‌న‌సైనికులు అంటున్నారు. ఇక వీడియోకి ఓ నెటిజ‌న్.. కౌరవసేనను కూల్చడానికి శ్రీకృష్ణుడిలా నిలబడ్డాడు. ఒక దౌర్భాగ్యపు పరిపాలనను అంతమొందించడానికి  ఆయన వెనక్కి తగ్గాడు.. నెగ్గాడు..నెగ్గించాడు. అతను ఆత్మవిశ్వాసం, నిజాయితీ, సేవా, మానవత్వం, బంధం విలువలు తెలిసినోడు, వాటిద్వారా గౌరవం, విలువలు, ఆనందం, ఆప్యాయతలు అన్ని లభిస్తాయి. ఇటువంటి వారికి పదవులు అనేవి చిన్నవి అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తాడు.