Pawan Kalyan: భీమ్లా నాయక్ ఆన్ డ్యూటీ
విధాత:పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కండల వీరుడు రానా దగ్గుబాటిల కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్‌గా వస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఓ […]

విధాత:పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కండల వీరుడు రానా దగ్గుబాటిల కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్‌గా వస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఓ ఇంట్రస్టింగ్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో పోలీస్ డ్రెస్‌లో ఉన్న పవన్ వెనక నుంచి కనిపించారు. భీమ్లా నాయక్ ఆన్ డ్యూటీ అన్న క్యాప్షన్‌తో పవన్ పాత్ర పేరును కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఈ ఫొటో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.