OG | పవన్ ‘ఓజీ’ నుంచి జోష్ సాంగ్ విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. "ఓజస్ గంభీరా" అంటూ సాగిన ఈ పాట పవన్ పాత్రను హైలైట్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

OG | పవన్ ‘ఓజీ’ నుంచి జోష్ సాంగ్ విడుదల

OG | విధాత: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’ నుంచి కీలక ఆప్డేట్ వెలువడింది. ఓజీ చిత్ర యూనిట్ శనివారం పవన్అభిమానుల కోసం ఓ పాటను విడుదల చేసింది. ఓజస్..గంభీరా అంటూ సాగే ఈ పాటలో సినిమాలో హీరో పవన్ పాత్రను హైలెట్ చేసేలా కొనసాగింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఎప్పటిలాగే బాక్సులు పగిలిపోయే వాయిధ్యాలతో సాగింది.

పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా మోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ తుది దశకు చేరింది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఓజీ మూవీ పాట పవన్ కల్యాణ్ అభిమానుల్లో జోష్ నింపేదిగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.