Prabhas-Nag Ashwin Movie: రెమ్యునరేషనే రూ.200 కోట్లు! హాట్ టాపిక్ గా మారిన నాగ్ -ప్రభాస్ మూవీ
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పూర్తి బడ్జెట్ ఎన్ని కోట్లవుతుందో తెలీదుగానీ కేవలం అందులో నటిస్తున్న స్టార్లకు ఇవ్వాల్సిన రెమ్యునరేషనే రూ.200 కోట్లు ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. లీకైన ఈ వార్త నెట్టింట గుప్పుమంటోంది. కేవలం నటీనటులకే రూ.200 కోట్లు చెల్లిస్తున్నారంటే ఇక సినిమాను ఏ రేంజ్‌లో తీస్తారోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో మెజారిటీ వాటా ప్రభాస్‌దేనన్న విషయం తెలిసిందే. డార్లింగ్ హీరో ప్రభాస్ ఒక్కడే రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని […]

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పూర్తి బడ్జెట్ ఎన్ని కోట్లవుతుందో తెలీదుగానీ కేవలం అందులో నటిస్తున్న స్టార్లకు ఇవ్వాల్సిన రెమ్యునరేషనే రూ.200 కోట్లు ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. లీకైన ఈ వార్త నెట్టింట గుప్పుమంటోంది. కేవలం నటీనటులకే రూ.200 కోట్లు చెల్లిస్తున్నారంటే ఇక సినిమాను ఏ రేంజ్‌లో తీస్తారోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో మెజారిటీ వాటా ప్రభాస్‌దేనన్న విషయం తెలిసిందే. డార్లింగ్ హీరో ప్రభాస్ ఒక్కడే రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తెలుగు ప్రేక్షకులను ఇక ఈ చిత్రం ద్వారా పలకరించనుంది. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మరో ఏడెనిమిది మంది బాలీవుడ్ నటులను కూడా సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట నాగ్ అశ్విన్. ఈ సినిమా షూటింగ్‌ను జూలైలో ప్రారంభించాలనుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా చిత్రీకరణను అక్టోబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.