SPIRIT Movie| హైస్పిరిట్స్లో ప్రభాస్ ‘స్పిరిట్’ – రోజురోజుకీ పెరిగిపోతున్న అంచనాలు
కల్కి విజయంతో రెబెల్‌స్టార్ ప్రభాస్(Prabhas), యానిమల్(Animal) ధమాకాతో సందీప్‌రెడ్డి(Sandeep reddy Vanga) వంగా మంచి ఊపు మీదున్నారు. ఇప్పుడు వారిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్నహైఓల్టేజ్ పోలీస్ థ్రిల్లర్ స్పిరిట్(SPIRIT)పై అభిమానులు భారీ ఆశలు అల్లుకుంటున్నారు. కారణం, స్పరిట్ టీమ్ మెల్లమెల్లగా ఒక్కో ప్రత్యేకతను రివీల్ చేయడమే.

Prabhas’s SPIRIT: అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ సినిమాల బంపర్ హిట్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఎక్కడికో వెళ్లిపోయాడు. అందునా కబీర్‌సింగ్, యానిమల్ హిందీ సినిమాలు కావడంతో ఆయన పేరు దేశవిదేశాలలో మారుమోగిపోయింది. ఇక రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. పాన్ ఇండియా హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరే ప్రభాస్. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో స్పిరిట్ రాబోతోంది. ప్రభాస్ ఇంకా ఎంటరవలేదు గానీ, షూటింగ్ మాత్రం మొదలైందని(Shooting started) వినికిడి.
ఇక తారాగణం గురించి బోలెడు వార్తలు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నట దంపతులు కరీనాకపూర్–సైఫ్ అలీ ఖాన్(Kareena Kapoor – Saif Ali Khan) ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్నా పాత్రలు పోషిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఇంకో సూపర్ న్యూస్ ఏంటంటే, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించబోతున్నట్లు, ఈ మేరకు దర్శకుడు మమ్ముటికి కథ చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. కాగా, ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్ల(500 Crores)కు పైగా అని, దర్శకుడు ఏ విషయంలోనూ రాజీపడటం లేదని అంటున్నారు. అటు కల్కి(Kalki 2898AD) విజయంతో ప్రభాస్, ఇటు యానిమల్ విజయంతో సందీప్ పూర్తిగా నో కాంప్రమైజ్ మోడ్(No Compromise Mode)లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కథ కూడా సమకాలీన సమస్య అయిన మాదకద్రవ్యాల(Drug issue)పై ఉంటుందని, హీరో ప్రభాస్ ఏ మాత్రం జాలి,దయ లేని కర్కోటక పోలీసు అధికారి(Ruthless Police Officer) పాత్రలో నటిస్తున్నట్లు, ముంబయి డ్రగ్ మాఫియాతో తలపడే ఫెరోషియస్ కాప్‌గా ప్రభాస్‌ను విభిన్నంగా చూపించే ప్రయత్నం సందీప్ చేస్తున్నట్లు, ప్రభాస్ మొదటిసారిగా పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన గెటప్ కూడా పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఈ అప్డేట్లు చూస్తున్న ప్రభాస్ అభిమానుల స్పిరిట్‌ను పీక్స్‌కు ఈ ‘స్పిరిట్’.