Gill| ఆ న‌టితో శుభ్‌మ‌న్ గిల్ పెళ్లి అంటూ ప్ర‌చారం.. క్లారిటీ ఇదే..!

Gill| టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్ర‌స్తుతం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న గిల్ ఆ టోర్నీలో త‌న జ‌ట్టుకి క‌ప్ అందించ‌లేక‌పోయాడు.ఇక గిల్‌కి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఫ‌లానా వ్య‌క్తితో ప్రేమ‌, పెళ్లి

  • By: sn    cinema    Jun 02, 2024 8:15 AM IST
Gill| ఆ న‌టితో శుభ్‌మ‌న్ గిల్ పెళ్లి అంటూ ప్ర‌చారం.. క్లారిటీ ఇదే..!

Gill|  టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్ర‌స్తుతం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న గిల్ ఆ టోర్నీలో త‌న జ‌ట్టుకి క‌ప్ అందించ‌లేక‌పోయాడు.ఇక గిల్‌కి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఫ‌లానా వ్య‌క్తితో ప్రేమ‌, పెళ్లి అంటూ నెట్టింట వార్త‌లు వైర‌ల్ అవుతూనే ఉంటాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా ప్రచారం జ‌ర‌గ‌డం మ‌నం చూశాం. సారా-గిల్ ప్రేమ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందని వార్తలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి.

ఇటీవ‌ల బాలీవుడ్ సీరియల్ నటి రిధిమా పండిట్‌ను గిల్ పెళ్లి చేసుకోనున్నాడంటూ నెట్టింట ఒక‌టే ప్రచారం జ‌రుగుతుంది.. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్ల‌పై నటి రిధిమా స్పందించారు. “నేను ఉదయానే లేచి చూడగానే నాకు జర్నలిస్టుల నుంచి పలు ఫోన్ కాల్స్ రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. వాళ్లు న‌న్ను పెళ్లి గురించి అడ‌గ్గా, అందుకు నేనే చేసుకోవ‌ట్లేదు అని చెప్పాను. నా జీవితంలో అలాంటి ముఖ్య‌మైన ఘ‌ట్టం ఏదైన ఉంటే ఆ విష‌యం గురించి మీకు త‌ప్ప‌కుండా అనౌన్స్ చేస్తాను. ఇవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే వాటిని ఎవ‌రు న‌మ్మోద్దు అంటూ రిద్దిమా క్లారిటీ ఇచ్చింది. దీంతో రూమ‌ర్స్‌కి పులిస్టాప్ ప‌డింది.

బిగ్ బాస్ తొలి సీజన్ అనంతరం రిధిమా బాగా ఫేమ‌స్ అయింది. అయితే ‘బహు హమారీ రజనీకాంత్’ టీవీ షోతో రిధిమాకి బాగా పాపులారిటీ ద‌క్క‌గా అందులో ఆమె రోబోగా నటించి ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది. ఇక గిల్ , టీమిండియాతో కలిసి అమెరికాలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌నకు గిల్ ఎంపికకానప్పటికీ రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో కలిసి ఉంటున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.ఈ వార్త‌ల‌పై ఆయ‌న నుండి ఎలాంటి స్పంద‌న లేదు.