హిందీ ‘జనతా గ్యారేజ్’ లో సల్మాన్ ఖాన్

విధాత :తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'జనతా గ్యారేజ్' మూవీ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడా..ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. సల్మాన్‌తో ఓ సినిమా చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారని, 2023 లో ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా సల్మాన్‌తో మైత్రీ […]

హిందీ ‘జనతా గ్యారేజ్’ లో సల్మాన్ ఖాన్

విధాత :తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘జనతా గ్యారేజ్’ మూవీ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడా..ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. సల్మాన్‌తో ఓ సినిమా చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారని, 2023 లో ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా సల్మాన్‌తో మైత్రీ వారు చేయబోయేది కొరటాల శివ – జూనియర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా అక్కినేని సమంత – నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పుడు ఇదే సినిమా రీమేక్‌ను సల్మాన్ చేయబోతుండగా, ఆయన సొంత నిర్మాణ సంస్థ భాగ స్వామ్యంతో మైత్రీ వారు నిర్మించనున్నట్టు సమాచారం. హిందీ రీమేక్‌ని తెరకెక్కించే దర్శకుడు..తదితర విషయాలను త్వరలో వెల్లడించనున్నారని తెలుస్తోంది.