Samantha| మహేష్ బాబుతో సమానంగా నాగ చైతన్యకి రేటింగ్ ఇచ్చిన సమంత… ఏ విషయంలో అంటే..!
Samantha| నాగ చైతన్య- సమంత టాలీవుడ్ క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరిని చూసి మురిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు సంతోషంగానే జీవించారు. కాని వారి మధ్య వచ్చిన మనస్పర్థల వలన విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి దారు

Samantha| నాగ చైతన్య- సమంత టాలీవుడ్ క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరిని చూసి మురిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు సంతోషంగానే జీవించారు. కాని వారి మధ్య వచ్చిన మనస్పర్థల వలన విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి దారులలో వారు పయనిస్తున్నారు. అయితే నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడడం మనం చూశాం. ఆ వ్యాధి నుండి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆ మధ్య ` మా ఇంటి బంగారం` అనే సినిమాని ప్రకటించింది. మరోవైపు హిందీలో `సిటాడెల్` వెబ్ సిరీస్ తో పలకరించేందుకు సిద్ధమైంది.
అయితే ఇటీవల సమంతకి సంబంధించి అనేక విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి ఏ మాయ చేశావే అనే సినిమా చేయగా, ఈ మూవీ సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో వారి మధ్య లవ్ , రొమాన్స్ అద్భుతంగా పండింది. ఈ సినిమా ప్రారంభంలో సమంత చైతూకి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాన్స్‌లో కార్తీక్ పాత్రకి పది మార్కులు వేసింది. కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటూ కూడా కితాబిచ్చింది. లుక్స్ పరంగా రేటింగ్ ఇచ్చింది సమంత. స్టార్ హీరోల్లో ఎవరు బాగుంటారో చెబుతూ.. మహేష్ బాబుకి పదికి పది రేటింగ్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌కి 9.5 రేటింగ్, హృతిక్ రోషన్ తనకు నచ్చడని చెప్పి షాకిచ్చింది.
ఇక తన మాజీ భర్త నాగ చైతన్యకి కూడా ఏకంగా పది మార్కులు ఇచ్చింది. చాక్లెట్ భాయ్ రణ్బీర్ కపూర్‌కి 8 మార్కులు వేసింది. ఇక ఏ మాయ చేశావే సినిమా సమయంలో గౌతమ్ మీనన్ తనకి స్టోరీ చెప్పలేదని, ఆయన సినిమాలో నటించే ఛాన్స్ రావడమే గొప్ప విషయమని సమంత చెప్పుకొచ్చింది. జేస్సీ పాత్రలో రెండు మూడు రోజులకు ఇన్వాల్వ్ అయినట్టు చెప్పింది. నాగచైతన్యని కలిసే సీన్‌లో టెన్షన్ పడిన సమంత గౌతమ్ మీనన్ సలహాలు సూచనలతో కూల్ అయిందట. మొత్తానికి ఈ చిత్రం సమంత, నాగ చైతన్య కెరీర్‌లో ప్రత్యేకం అనే చెప్పాలి.