Shruti Haasan | ‘డెకాయిట్‌’ మూవీ నుంచి తప్పుకున్న శ్రుతి హాసన్‌..! ఇద్దరి మధ్య గొడవే కారణమా..?

Shruti Haasan | శ్రుతి హాసన్‌ (Shruti Haasan) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కమల్‌ హాసన్‌ వారుసురాలిగా సినీరంగ ప్రవేశం చేసింది. తన నటనతో హీరోయిన్‌గా సత్తాచాటుతున్నది. తెలుగుతో పాటు తమిళం, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం అడివి శేష్‌ (Adivi Sesh), శ్రుతి హాసన్‌ (Shruti Haasan) జంటగా ‘డెకాయిట్‌’ మూవీ (Dacoit Movie)ని ప్రకటించిన విషయం తెలిసిందే.

  • By: Mallanna |    cinema |    Published on : Oct 15, 2024 12:31 PM IST
Shruti Haasan | ‘డెకాయిట్‌’ మూవీ నుంచి తప్పుకున్న శ్రుతి హాసన్‌..! ఇద్దరి మధ్య గొడవే కారణమా..?

Shruti Haasan | శ్రుతి హాసన్‌ (Shruti Haasan) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కమల్‌ హాసన్‌ వారుసురాలిగా సినీరంగ ప్రవేశం చేసింది. తన నటనతో హీరోయిన్‌గా సత్తాచాటుతున్నది. తెలుగుతో పాటు తమిళం, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం అడివి శేష్‌ (Adivi Sesh), శ్రుతి హాసన్‌ (Shruti Haasan) జంటగా ‘డెకాయిట్‌’ మూవీ (Dacoit Movie)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ జరుగుతుండగా.. ఈ మూవీ నుంచి అర్ధాంతరంగా శ్రుతి హసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, శ్రుతి హాసన్‌ వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వడంతో.. ఈ విషయంలో గొడవ జరిగిందని టాక్ నడుస్తున్నది.

దాంతో మూవీ నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుంటున్నట్లు దర్శక నిర్మాతలకు తెగేసి చెప్పినట్లు సమాచారం. మూవీ సగం షూటింగం జరిగిపోవడంతో హీరోయిన్‌గా మరొకరిని ఎలా తీసుకోవాలనే విషయంలో మేకర్స్‌ తలలు పట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. శ్రుతి హాసన్‌ నిజంగానే మూవీ నుంచి తప్పుకుందా? లేదా తెలియరాలేదు. కానీ, మేకర్స్‌ మాత్రం మరో హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు టాక్‌. అలాగే, డైరెక్టర్‌ షనైల్‌ డియో తన కుటుంబంతో కలిసి పనిపై విదేశాలకు వెళ్లారని.. ఆ సమయంలో కొన్ని సీన్స్‌ను అడవి శేష్‌ తీసేందుకు ప్రయత్నించారని.. అది కూడా శ్రుతి హాసన్‌ తప్పుకునేందుకు ఓ కారణంగా తెలియవచ్చింది.

ఇద్దరి మధ్య ఏవో గొడవలు జరిగాయని ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఎంత వరకు నిజమున్నదో తెలియరాలేదు. మూవీ నుంచి శ్రుతి తప్పుకుంటే నిర్మాతలకు బడ్జెట్‌ భారీగా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తకావడం.. మళ్లీ సీన్స్‌ అని తెరక్కించాలంటే బడ్జెట్‌ తడిసిమోపెడయ్యే అవకాశాలున్నాయి. ఇక డెకాయిట్‌ మూవీని అన్నపూర్ణ సూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. క్షణం, గూఢచారి మూవీలకు ఫొటోగ్రఫీ డైరెక్టర్‌గా పని చేసిన షనైల్‌ డియో ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ భాషల్లో వేర్వేరుగా షూటింగ్‌ జరుపుతున్నట్లు టీం ప్రకటించిన విషయం తెలిసిందే.