Alcohol|ఇప్పటికీ ఆల్కహాల్ ముట్టని బ్రహ్మానందం, ఆలీ.. కారణం ఏంటో తెలుసా?
Alcohol| సినీ ప్రపంచంలో జరిగే మాయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటకి కనిపించినంత అట్టహాసంగా వారి జీవితాలు ఉండవు. పైకి సంతోషంగా కనిపించిన లోపల కొందరికి చాలా నిరాశ, నిస్పృహలు ఉంటాయి. ఇక సినీ పరిశ్రమలోకి వచ్చిన వారు తప్పక చెడు అలవాట్లకి బానిస అవుతారు

Alcohol| సినీ ప్రపంచంలో జరిగే మాయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటకి కనిపించినంత అట్టహాసంగా వారి జీవితాలు ఉండవు. పైకి సంతోషంగా కనిపించిన లోపల కొందరికి చాలా నిరాశ, నిస్పృహలు ఉంటాయి. ఇక సినీ పరిశ్రమలోకి వచ్చిన వారు తప్పక చెడు అలవాట్లకి బానిస అవుతారు అనే ప్రచారం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులలో కొందరు సినీ ప్రముఖులు కూడా పట్టుబడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. హేమ వ్యవహారం ఎంత రచ్చగా మారిందో మనం చూశాం. ఇక చెడు అలవాట్లకి బానిసై ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడ్డ నటీనటులు ఎందురో ఉన్నారు. అయితే కొందరు మాత్రం కెరీర్ మొదటి నుండి జాగ్రత్తగా లైఫ్ ను లీడ్ చేసుకుంటూ మంచి పొజీషన్‌లో ఉన్నారు.
మందే ముట్టలేదా..
సినీ పరిశ్రమలో ఇప్పటికీ మందు తాగని కొందరు ప్రముఖులు ఉన్నారు. వారిలో సీనియర్ కమెడియన్లు బ్రహ్మానందం, అలి తప్పక ఉంటారు. వారిద్దరికి ఆల్కహాల్ వాసన కాని, రుచి కాని ఏ మాత్రం తెలియదట. వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించిన కూడా ఇది నిజం అంటున్నారు. ఇండస్ట్రీలో ఉంటే ఏదో ఒక సందర్భంలో చుక్క అయిన వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాని వీరిద్దరు ఇప్పటి వరకు మందు ముట్టుకోలేదని వేరే వేరు సందర్భాలలో చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం ఆరు దాటితే ఇంటికి వెళ్లిపోతాడట. ఆ సందర్భంలో దర్శకుడు .. ఏంటయ్యా.. 6 దాటితే షూటింగ్ నుంచి వెళ్ళిపోతావ్.. ఏం చేస్తావు అని ప్రశ్నించాడట. తాను ఆరు దాటక పబ్‌కో లేదంటే పార్టీకి వెళతాడని అందరు అనుకునేవారట. అయితే తాను ఆల్కహాల్ ఎలా ఉంటుందో అస్సలు కూడా టేస్ట్ చేయలేదట. 8 తరువాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను అన్నారు బ్రహ్మానందం.
ఇక కమెడియన్ అలి కూడా ఓ ఇంటర్వ్యూలో ఆల్కాహాల్ గురించి మాట్లాడుతూ.. నాకు ఆల్కాహాల్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నారు. నేను , బ్రహ్మానందం గారు కూడా ఇంత వరకూ టేస్ట్ కూడా చేయలేదు. అలా చాలామంది ఉన్నారు. మనకు వద్దు.. తాగాలని లేదు. అలవాటు చేసుకోవాలని అస్సలు లేదు. అందులో పెద్ద కారణం కూడా ఏం లేదు అంటూ ఆలీ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో సరదాకి తాగేవారు ఉన్నారు. అకేషన్ ప్రకారం తాగేవారు ఉన్నారు. అదే పనిగా ఇంట్లో కూర్చోని తాగేవారు కూడా ఉన్నారు.ఒకప్పుడు సరదాగా కలిస్తే.. టీ తాగుదామా.. తింటానికి వెళ్దామా అని అనుకునేవారం.. ఇప్పుడేమో ఏంటి మరి.. బాటిల్ ఓపెన్ చేద్దామా అని అనుకునే పరిస్థితి వచ్చింది అంటూ ఓ సందర్భంలో ఆలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.