Tollywood | టాలీవుడ్‌లో.. ఇప్ప‌టి వ‌ర‌కు విడాకులు తీసుకున్న స్టార్స్ వీరే..!

Tollywood | అందరూ అనుమానించినట్లే నిహారిక విడాకులు మంజూరు అయ్యాయి. చైతన్య జొన్నలగడ్డతో ఆమె విడిపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న స్టార్స్ ఎవరు అనే టాపిక్ మరోసారి తెర‌పైకి వచ్చింది. మెగా ఫ్యామిలీ గారాల పట్టి నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు 2020 డిసెంబర్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లై మూడేళ్లు పూర్తవ్వకుండానే వీరిద్దరూ విడిపోయారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయినట్లు పోస్ట్ కూడా అఫిషియల్ […]

  • By: sn    cinema    Jul 07, 2023 1:00 AM IST
Tollywood | టాలీవుడ్‌లో.. ఇప్ప‌టి వ‌ర‌కు విడాకులు తీసుకున్న స్టార్స్ వీరే..!

Tollywood |

అందరూ అనుమానించినట్లే నిహారిక విడాకులు మంజూరు అయ్యాయి. చైతన్య జొన్నలగడ్డతో ఆమె విడిపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న స్టార్స్ ఎవరు అనే టాపిక్ మరోసారి తెర‌పైకి వచ్చింది. మెగా ఫ్యామిలీ గారాల పట్టి నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు 2020 డిసెంబర్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లై మూడేళ్లు పూర్తవ్వకుండానే వీరిద్దరూ విడిపోయారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయినట్లు పోస్ట్ కూడా అఫిషియల్ గా షేర్ చేయడంతో ఈ న్యూస్ మరింత వైరల్ అయ్యింది.

ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎంటర్ టైనింగ్ కపుల్ గా సమంత, నాగచైతన్య ఉండే వారు. అలాంటి వీరిద్దరూ కూడా 2021లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి విడాకులు టాపిక్ ఇప్పటికీ కూడా హాట్ టాపిక్ గానే ఉంది. నెక్ట్స్ మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారు. మొదట మనోజ్ కు ప్రణీతా రెడ్డితో వివాహం జరిగింది. వీరు కూడా పలు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. రీసెంట్ గా భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.

స్టార్ సింగర్ సునీతకు మొదట కిరణ్ తో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆయ‌న నుంచి విడిపోయిన‌ చాలా సంవత్సరాల తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు సునీత .ఇక అక్కినేని ఫ్యామిలీ విషయానికి వస్తే.. అక్కినేని సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకు వీరి వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.

అక్కినేని నాగార్జున.. 1984లో ప్రముఖ నిర్మాత రామానాయుడి కూతురురు లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. 1990లో విడాకులు తీసుకోగా అప్పటికే నాగ చైతన్య జన్మించాడు. అనంతరం రెండేండ్ల తర్వాత హీరోయిన్ అమలను నాగార్జున పెళ్లి చేసుకోగా అఖిల్ పుట్టారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వివాదం అయితే ప్రస్తుతం రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నందినిని పెళ్లి చేసుకున్నారు. నెక్ట్ ఈమెతో విడాకులు తీసుకుని.. 2009లో హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. 2012లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. 2013 లో రష్యా హీరోయిన్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు.

ఇక‌ సీనియర్ నటుడు నరేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చి ఇప్పుడు నాల్గవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. నరేష్ కు మొదట డాన్స్ మాస్టర్ శ్రీను కూతురితో పెళ్లి జరగ్గా.. పలు విభేదాల కారణంగా ఆమెతో విడిపోయి.. రేఖ సుప్రియను పెళ్లి చేసుకుని.. ఆమెకి కూడా విడాకులు ఇచ్చి.. రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా ఆమెతో కూడా విడిపోయారు. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.