వేణు త్వరలో నానితో మూవీ చేయనున్నాడని సమాచారం. నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు.
జబర్ధస్త్ షోతో ప్రేక్షకులకి చాలా దగ్గరైన వారిలో వేణు ఒకరు. వేణు వండర్స్ అనే టీంతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అతను స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడున్న గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఆయన టీంలో నుంచి వచ్చినవారే. తన కామెడీ స్కిట్లతో నవ్వుల పువ్వులు పూయించిన టిల్లు వేణు అనూహ్యంగా జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పేసి మెగా ఫోన్ పట్టుకున్నాడు. జబర్దస్త్‌కు ముందు కొన్ని సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించిన వేణు ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు. బలగం సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. తెలంగాణ కథాంశం నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక వేణు తర్వాతి సినిమా ఎవరితో అని కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో వేణు త్వరలో నానితో మూవీ చేయనున్నాడని సమాచారం. నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు.‘అంటే సుందరానికీ…’ మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చిత్రం వస్తుండగా, ఈ ఫిల్మ్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ కోసం బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని సమాచారం. ఇక తమిళ కల్ట్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తోనూ ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. మరి ఈ సినిమా తర్వాత ‘బలగం’ డైరెక్టర్ వేణు ఎల్దండి డైరెక్షన్ లో నాని నటించేందుకు రెడీ అయ్యారని ఓ వార్త బయటకు వచ్చింది.
దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో నాని నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే సరైనా స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని , అది పూర్తి కాగానే ప్రకటన రానుందని అంటున్నారు. సంక్రాంతికే ప్రకటన చేయబోతున్నారని టాక్. ఇక నాని ‘దసరా’ సినిమాతో రా అండ్ రాస్టిక్ గా కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు వేణు దర్శకత్వంలో కూడా మాస్ లుక్‌లో కనిపించి సందడి చేయబోతున్నట్టు సమాచారం.