తనిఖీల్లో 48.33కోట్లు పట్టివేత

ఎన్నికల షెడ్యూల్ ప్రకటన పిదప తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న తనిఖీల్లో ఇప్పటిదాకా 48.33కోట్ల నగదు పట్టుబడింది

తనిఖీల్లో 48.33కోట్లు పట్టివేత

విధాత : ఎన్నికల షెడ్యూల్ ప్రకటన పిదప తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న తనిఖీల్లో ఇప్పటిదాకా 48.33కోట్ల నగదు పట్టుబడింది. వీటిలో 17.50కోట్ల బంగారం, నగలు, 2.49కోట్ల మద్యం నిల్వలు ఉన్నాయి. శనివారం మేడ్చల్ చెక్‌పోస్టు వద్ధ పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు. ఓ రియల్టర్ నుంచి 35లక్షలు, మరో వ్యాపారి నుంచి 13లక్షలు, జ్యూవెలరీ యాజమాని నుంచి 5లక్షల 68వేలు, 18తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు పట్టుబడిన సొమ్మును స్క్రీినింగ్ కమిటీ ముందు అప్పగిస్తామని సరైన దృవపత్రాలు చూపి తీసుకెళ్లవచ్చని, లేదంటే కేసులు పెట్టి దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తామన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాల్లో నగదు తరలించవద్దని, ఎన్నికల వేళ 50వేల కంటే అధికంగా డబ్బు తీసుకెళ్లరాదన్నారు