జగద్గిరిగుట్టలో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ
విధాత: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ బృందం, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి సోదాలు చేశారు. జగద్గిరిగుట్టలోని రోడ్ నెంబర్ 1లో జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో నిబంధనలకు విరుద్ధంగా విరుద్ధంగా అమ్ముతున్న 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లతో పాటు 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. మోహన్ అనే వ్యక్తి కలకత్తా నుండి గంజాయి సరఫరా చేస్తూ నగరంలో మనోజ్ కుమార్ అగర్వాల్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రధాన నిందితుడైన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram