ప్రైవేటు బస్సు బోల్తా..10 మందికి గాయాలు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళుతున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళుతున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.